ఒరాకిల్ లేయాఫ్స్.. టెక్ ఇండస్ట్రీలో భారీ ప్రకంపనలు సృష్టించిందనే చెప్పాలి. ఒక్క ఫోన్ లేదు, ఒక్క మీటింగ్ లేదు, ముందస్తు హెచ్చరికలు లేవు.. జస్ట్ ఒకే ఒక్క మెయిల్ తో మీ జాబ్ ఊస్ట్ అయ్యిందని చావు కబురు చల్లగా చెప్పింది కంపెనీ. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 30 వేల ఉద్యోగులను కంపెనీ తొలగించగా.. ఇండియా నుంచి 12 వేల మంది ఈ లిస్టులో ఉన్నారు. కంపెనీ తీసుకున్న హార్ష్ డెసిషన్ కారణంగా ఎంతో మంది టెకీల బతుకులు రోడ్డున పడ్డాయి. దీనిపై కొందరు ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా కొందరు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఒక్క మెయిల్ తో మాజీలుగా మారిన ఒరాకిల్ ఎంప్లాయిస్ కన్నీటి కథలు, గాథలు ఏంటో మీరే చదవండి.
నా భార్య 7 నెలల గర్భవతి.. నిర్దాక్షిణ్యంగా తొలగించారు:
నా భార్య 7 నెలల గర్భవతి..నిద్రలేవక ముందే మిమ్మల్ని తొలగిస్తున్నట్లు లేయాఫ్ ఈమెయిల్ వచ్చింది.. అంటూ ఒక ఉద్యోగిని భర్త లింక్ డిన్ లో పోస్ట్ చేశాడు. నో కాల్, నో మీటింగ్, నో మేనేజర్, నో వార్నింగ్, జస్ట్ ఈమెయిల్, డాక్యుసైన్.. అంతే నా భార్యను అన్ని రకాల ఇంటర్నెట్ సిస్మమ్స్ నుంచి లాక్ అవుటు చేశారంటూ ఆస్టిన్ మెస్సీ అనే వ్యక్తి పోస్ట్ చేశాడు. తమకు 17 నెలల బాబు కూడా ఉన్నాడని.. ఇంత దారుణంగా రోడ్డున పడేయటమేంటని ప్రశ్నిస్తున్నాడు. నేను ఇది కోపంతో రాయటం లేదు.. సంస్థలో ఏంజరుగుతుందో, ఎంత కాఠిన్యంతో వ్యవహరిస్తున్నారో అందరికీ తెలియాలని రాస్తున్నానంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. నా భార్యకు ఇంతకంటే బెటర్ ప్లేస్ మెంట్ కు అర్హురాలని.. తను చూసిన వాళ్లలో తన భార్య మోస్ట్ ట్యాలెంటెడ్ అని.. షి డిసర్వ్డ్ బెటర్ దెన్ మెయిల్ అంటూ రాసుకొచ్చాడు.
దీనిపై మెస్సీ భార్య లైలా మెస్సీ స్పందించింది. నాలుగేళ్లుగా నేను కంట్రిబ్యూట్ చేసిన దానికి గర్వంగా ఉన్నాను.. ఇంత వండర్ఫుల్ జర్నీకి ఇంత డిసప్పాయింట్ ఎగ్జిట్ ఇవ్వడం జీర్ణించుకోలేకపోతున్నట్లు చెప్పింది.
ఒక్క రాత్రితో మారిపోయింది.. ఫ్యామిలీ, ఫైనాన్స్, ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నా:
హృషికేశ్ నర్ష అనే బెంగళూరుకు చెందిన ఒరాకిల్ గ్రూప్ మేనేజర్.. తన లేఆఫ్ గురించి తీవ్ర వేదనను షేర్ చేసుకున్నాడు. కంపెనీ కోసం 16 ఏళ్లు ధారపోశాను. కానీ నా జర్నీ ఇలా ఎండ్ అవుతుందనుకోలేదు. కొన్నిసార్లు అద్భుత ప్రయాణాలు కూడా ఎలాంటి వార్నింగ్ లేకుండానే ముగుస్తుంటాయి. నా పరిస్థితి కూడా అంతే. రోజువారి ప్రాధాన్యతలు ఒక్క రాత్రితో మారిపోయాయి అంటూ పోస్ట్ చేవాడు. అందరిలాగే నాకు కూడా అవే ప్రశ్నలున్నాయి. కుటుంబం, ఆర్థిక పరిస్థితులు, భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను అంటూ పోస్ట్ చేశాడు.
తను ఎలా పడిపోయిందనే దాని గురించి కాకుండా.. ఇప్పుడు ఈ ఛాలెంజ్ ను ఎలా ఎదుర్కోవాలనే దానిపై ఆలోచిస్తున్నానని అన్నాడు. ఒరాకిల్ నన్న ఒక లీడర్ గా నా లైఫ్ ను షేప్ చేసింది. ఎంతో మంది ఫ్రెండ్స్ ను, ఎంతో కెరీర్ ను అందించింది. ఇది ఒక కొత్త చాలెంజ్ గా స్వీకరిస్తాను అంటూ రాసుకొచ్చాడు.
మా నాన్నకు క్యాన్సర్.. ఇన్సురెన్స్ కూడా లేదు:
లేయాఫ్స్ పై ఒక ఉద్యోగి కుమారుడు చేసిన పోస్ట్ తీవ్ర ఆవేదన కలిగించేలా ఉంది. మా నాన్న 20 ఏళ్లు కంపెనీ కోసం పనిచేశాడు. ఒకే బాస్ కింద 20 ఏళ్లు పనిచేశాడు. కనీసం ఒక్క ఫోన్ కాల్ కూడా లేదు. ఈ కంపెనీలు పెద్ద రాక్షసులు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మిగతా రెండేళ్లు నా నాన్న ఏం చేయాలి. మా నాన్నకు క్యాన్సర్ ఉంది. కనీసం ఇన్సూరెన్స్ కూడా లేదు అంటూ సోషల్ మీడియాలో వాపోయాడు.
దీనికి నెటిజన్లు, లేయాఫ్స్ కు గురైన ఉద్యోగుల నుంచి భారీ స్పందన వచ్చింది. ఒక సీనియర్ రిప్లై ఇస్తూ.. నేను 29 ఏండ్లుగా పనిచేస్తూ వచ్చాను. ఒక్క ఈమెయిల్ తో ఈ రోజు నేను కూడా రోడ్డున పడ్డాను. ధైర్యంగా ఉండండి. దేవుడి దయ మీ తండ్రిపైన ఉంటుంది.. అంటూ రిప్లై ఇచ్చాడు.
కొందరు ఇన్సూరెన్స్ గురించి ఒరాకిల్ కంపెనీపై ఒత్తిడి చేయవచ్చు. మీరు పోరాటం చేస్తే చాలా మంది మీకు మద్ధతు ఇస్తారు.. అంటూ సలహాలు ఇచ్చారు.
