పంచాయతీరాజ్​లో 311 పోస్టులు

పంచాయతీరాజ్​లో 311 పోస్టులు

పంచాయతీరాజ్​శాఖలో 311 కొత్త పోస్టులను మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావు ఉత్తర్వులు జారీ చేశారు. వాటిలో జడ్పీ సీఈవో 23, డిప్యూటీ సీఈవో 23, జిల్లా పంచాయతీ అధికారులు (డీపీవో) 23, డివిజనల్​ పంచాయతీ ఆఫీసర్​ (డీఎల్​పీవో) 40, ఎంపీడీవో 10, మండల పంచాయతీ ఆఫీసర్​ 101 పోస్టులు ఉన్నాయి. గత నెల, ఈ నెలలో 23 జిల్లా పరిషత్​లు, వందకుపైగా మండల పరిషత్​లు ఏర్పడ్డాయి. అయితే కొత్త పోస్టులు మాత్రం మంజూరు చేయలేదు. దీంతో అధికారులకు తాత్కాలికంగా పదోన్నతులు ఇచ్చి కొత్త జడ్పీలు, మండల పరిషత్​లలో నియమించారు. పంచాయతీరాజ్​ శాఖలో పోస్టులను భర్తీ చేయాలని సీఎం  ఆదేశాలివ్వడంతో కొత్త పోస్టులను మంజూరు చేసినట్టు తెలుస్తోంది. ఈవోపీఆర్​డీ (ఎక్స్​టెన్షన్​ ఆఫీసర్​ పీఆర్​డీ) పోస్టును మండల పంచాయతీ ఆఫీసర్​గా మార్చాలన్న సీఎం ఆదేశాలకు అనుగుణంగా అధికారులు మార్పులు చేస్తున్నారు. అందుకు తగ్గట్టు కొత్తగా మంజూరు చేసిన పోస్టుల్లో అధికారులు మండల పంచాయతీ ఆఫీసర్​గానే పోస్టులు మంజూరు చేశారు.