
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీలో ఎంప్లాయీస్ రిటైర్మెంట్ ఏజ్‌ను 61 ఏండ్లకు పెంచలేదు. ఈ మేరకు ఆర్టీసీ అధికారులు గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో సంస్థలో పదవీ విరమణలు మొదలు కానున్నాయి. అన్ని యూనిట్లలో పదవీ విరమణ చేయనున్న ఉద్యోగులను సత్కరించేందుకు ఏర్పాట్లు చేయాలని.. ఉద్యోగి, అతని కుటుంబంతో యూనిట్ అధికారి లంచ్ చేసి, సన్మానం చేయాలని పేర్కొన్నారు. ఇక నుంచి ప్రతి నెల 100 నుంచి 200 మంది రిటైర్ కానున్నారు. ఆర్టీసీలో 49 వేల మంది పని చేస్తున్నారు. 2019 కంటే ముందు రిటైర్మెంట్ ఏజ్ 58 ఏండ్లే ఉండేది. 2019లో సమ్మె చేసినప్పుడు, అడగకున్నా రిటైర్మెంట్ ఏజ్‌ను ప్రభుత్వం 60 ఏండ్లకు పెంచింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఉద్యోగుల రిటైర్‌మెంట్ ఏజ్‌ను 61 ఏండ్లకు పెంచింది. ఇదే నిర్ణయాన్ని కార్పొరేషన్లకూ వర్తింపజేసింది. ఆర్టీసీలో కూడా 61ఏండ్లకు పెంచాల్సి ఉంది. దీనికి సంబంధించిన ఫైల్‌కు ప్రభుత్వం అనుమతివ్వలేదు.