టీఆర్ఎస్ జిల్లా ఆఫీసుకు 100కోట్ల భూమి

 టీఆర్ఎస్ జిల్లా ఆఫీసుకు 100కోట్ల భూమి
  • బంజారాహిల్స్​రోడ్​ నం. 12లో 4,935 గజాల ప్రభుత్వ జాగా
  • తెలంగాణ భవన్​కు సమీపంలోనే కేటాయిస్తూ ఉత్తర్వులు

హైదరాబాద్, వెలుగు: టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్​ జిల్లా ఆఫీస్​కు రాష్ట్ర సర్కార్ సుమారు రూ.100 కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ భూమిని కేటాయించింది. తెలంగాణ భవన్ కు అత్యంత సమీపంలోనే ఈ భూమిని కేటాయిస్తూ సీఎస్ సోమేశ్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం టీఆర్ఎస్ పార్టీ జిల్లా ఆఫీసు కోసం 4,935 చదరపు గజాల జాగా కేటాయించారు. షేక్ పేట మండలంలో సర్వే నం.403/పీ, టీఎస్ నం.18/పీ, 21/పీ, బ్లాక్ కే, వార్డు 12లో ఉన్న భూమిని కేటాయిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

బంజారాహిల్స్ రోడ్డు నం.12 ఎన్బీటీ నగర్ లో ఈ స్థలం ఉంది. ఉత్తర్వుల్లో రెఫరెన్సుగా 2018 ఆగస్టు 16న జారీ చేసిన జీవో 167ను చూపించారు. అయితే హైదరాబాద్​కలెక్టర్ లేఖ నం.రెవెన్యూ/ఇ6/0021/2022 పేరిట మంగళవారం సిఫారసు చేశారు. మరుసటి రోజే సీసీఎల్ఏ ఆమోదించారు. ఆ తరువాతి రోజే జీవో నంబర్​47 జారీ అయింది. హైదరాబాద్ కలెక్టర్ తగిన చర్యలు తీసుకోవాలని సీఎస్ సూచించారు. బంజారాహిల్స్ ఎన్బీటీ నగర్ లో గజానికి బహిరంగ మార్కెట్లో రూ.2.2 లక్షలు పలుకుతోంది. ఈ లెక్కన మొత్తం 4,935 గజాలకు రూ.108 కోట్లకు పైగా విలువ ఉంటుంది. 


 

ఇవి కూడా చదవండి

ధరణి తప్పులు సర్కారువి.. భారం రైతుకా?

వరంగల్ లో ల్యాండ్ పూలింగ్ నిలిపివేత

మరోసారి బయటపడ్డ ఇంటర్ బోర్డు తప్పిదం