దోహా: ప్రతిష్టాత్మక ఫిఫా వరల్డ్‌కప్ టిక్కెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఇప్పటికే మెగా టోర్నీకి సంబంధించి 1.2 మిలియన్ టిక్కెట్లు అమ్ముడుపోయినట్లు ఆర్గనైజర్స్ బుధవారం వెల్లడించారు. ఖతార్‌లో నవంబర్– డిసెంబర్‌లో జరగనున్న ఈ టోర్నీ టిక్కెట్లకు డిమాండ్ బాగా పెరుగుతోందని చీఫ్ ఆర్గనైజర్ హసన్ అల్ తవాదీ పేర్కొన్నారు. ప్రజల నుంచి 40 మిలియన్ టిక్కెట్ల కోసం విజ్ఞప్తులు వచ్చాయన్నారు. దోహలో పాపులేషన్ 2.4 మిలియన్లు ఉండగా, విదేశీ ఫ్యాన్స్‌తో హోటల్ రూమ్స్‌కు మస్తు డిమాండ్ పెరిగింది. టోర్నీ టైమ్ వరకు వసతికి చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

