గో పోషకుల సదస్సుకు రండి .. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎంపీ గడ్డం వంశీకృష్ణకు ఆహ్వానం

గో పోషకుల సదస్సుకు రండి .. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎంపీ గడ్డం వంశీకృష్ణకు ఆహ్వానం

హైదరాబాద్ సిటీ, వెలుగు: గోవుల సంరక్షణ కోసం ఈ నెల 18న ఖైరతాబాద్​ వాసవీ సేవా కేంద్రంలో నిర్వహిస్తున్న ‘గోశాలల నిర్వాహకుల, గోపోషకుల సదస్సుకు రావాలని సేవ్ ఆర్గనైజేషన్ నిర్వాహకులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణను కోరారు. 

ఈ మేరకు వారిని కలిసి ఇన్విటేషన్​ అందజేశారు. రాష్ట్రంలోని వెయ్యి మంది గోపోషకులు పాల్గొంటున్నారని తెలిపారు. సేవ్​ఆర్గనైజేషన్​నిర్వాహకులు ఎం.విజయ్​రామ్, సభ్యులు పాల్గొన్నారు.