గాంధీ మెడికల్ కు మరింత పేరు తేవాలి

 గాంధీ మెడికల్ కు మరింత పేరు తేవాలి
  • కొత్త బ్యాచ్ స్టూడెంట్స్​కు​  ఓరియెంటేషన్ ప్రొగ్రామ్

పద్మారావునగర్, వెలుగు: ప్రతిష్టాత్మకమైన గాంధీ మెడికల్ కాలేజీలో సీటు సంపాదించిన స్టూడెంట్లు క్రమశిక్షణతో చదివి కాలేజీ ప్రతిష్ఠను మరింత పెంచాలని ప్రిన్సిపల్ డా.ఇందిర, గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ డా.వాణి సూచించారు. గాంధీ మెడికల్ కాలేజీలో 2025 కొత్త బ్యాచ్ విద్యార్థులకు సోమవారం ఓరియెంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ప్రతి వారం సైకియాట్రి డిపార్ట్‌‌‌‌మెంట్ ద్వారా మానసిక ధైర్యం పెంపొందించే క్లాసులు ఉంటాయన్నారు. కాలేజీలో ర్యాగింగ్ నిరోధానికి కమిటీ వేసి చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఫస్టియర్​లో​80 శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. వైస్ ప్రిన్సిపల్స్, హెచ్‌‌‌‌ఓడీలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

గాంధీ ఏఆర్‌‌‌‌టీ సెంటర్‌‌‌‌ సేవలు భేష్‌‌‌‌

గాంధీ​లోని యాంటి రిట్రోవల్‌‌‌‌ థెరఫీ(ఏఆర్‌‌‌‌టీ) సెంటర్‌‌‌‌ అందిస్తున్న సేవలు బాగున్నాయని నేషనల్‌‌‌‌ ఎయిడ్స్‌‌‌‌ కంట్రోల్‌‌‌‌ ఆర్గనైజేషన్‌‌‌‌ (నాకో) ఉన్నతాధికారులు అభినందించారు. నాకో డిప్యూటీ డైరక్టర్‌‌‌‌ జనరల్‌‌‌‌ డాక్టర్‌‌‌‌ తంజిమ్‌‌‌‌డికిడ్, న్యూఢిల్లీ అధికార ప్రతినిధి డాక్టర్‌‌‌‌ రాజీవ్‌‌‌‌ తివారీల నేతృత్వంలో ప్రత్యేక బృందం సోమవారం గాంధీ హాస్పిటల్​లోని ఏఆర్‌‌‌‌టీ సెంటర్‌‌‌‌ను సందర్శించారు. రోగులకు అందిస్తున్న వైద్యసేవలు, టెస్టింగ్, ఎడ్యుకేషన్, కౌన్సెలింగ్, సీవోఈ, ఐసీటీసీ, ఓఎస్‌‌‌‌టీ, డీఎస్‌‌‌‌ఆర్‌‌‌‌సీ, ఎస్‌‌‌‌టీడీ క్లినిక్, పీపీటీసీ తదితర అంశాలపై 360 డిగ్రీల రివ్యూ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు.సికింద్రాబాద్ గాంధీ దవాఖానలో పునరుద్ధరించిన ఆర్థోపెడిక్, బర్న్స్, ప్లాస్టిక్ సర్జరీ ఆపరేషన్ థియేటర్లు, వార్డులను సూపరింటెండెంట్ డా.వాణి సోమవారం ప్రారంభించారు. రూ.35 లక్షల నిధులతో అర్పన్ రోగి సహాయత ట్రస్ట్,ఎస్పీఎం గ్రూప్, ఎన్వీఎస్ రిఫ్‌‌‌‌ కాంప్ ప్రైవేట్ లిమిటెడ్ వీటిని రెనోవేషన్ చేసింది