పీఎంశ్రీ హెచ్ఎంలకు జూలై 20, 21న ఓరియంటేషన్

పీఎంశ్రీ హెచ్ఎంలకు జూలై 20, 21న ఓరియంటేషన్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని పీఎంశ్రీ స్కూళ్ల ప్రిన్సిపాళ్లు, హెడ్మాస్టర్లకు ఈనెల20,21 తేదీల్లో ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించనున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌‌‌‌లోని కొమురం భీమ్ ఆదివాసీ భవన్ లో ఈ కార్యక్రమం జరగనున్నది.

దీనికి హెడ్మాస్టర్లతో పాటు జిల్లా సెక్టోరల్ ఆఫీసర్లు హాజరుకావాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశించారు. ఈ ప్రోగ్రామ్​కు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 794 పీఎంశ్రీ స్కూళ్ల హెచ్​ఎంలంతా హాజరయ్యేలా డీఈఓలకు చూడాలని స్పష్టం చేశారు.