సినిమాలు, వెబ్ సిరీస్లను నిర్మించనున్న జియో స్టూడియోస్

సినిమాలు, వెబ్ సిరీస్లను నిర్మించనున్న జియో స్టూడియోస్

న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్​కు చెందిన  మీడియా  కంటెంట్ విభాగమైన జియో స్టూడియోస్ సొంతంగా సినిమాలు, ఒరిజినల్ వెబ్ సిరీస్,  మినీ -ఒరిజినల్స్‌‌ను నిర్మించనుంది. క్రికెట్ ఐపీఎల్​ మ్యాచ్​లను ఉచితంగా ప్రసారం చేయడంతో ఈ యాప్​ వాడకం విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఒరిజినల్ కంటెంట్​ను కూడా తేవాలని నిర్ణయించింది. యాప్​ను పెయిడ్​సర్వీసుగానూ మార్చుతామని సంస్థ వర్గాలు తెలిపాయి. జియో స్టూడియోస్, హిందీ, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ, భోజ్‌‌పురితోపాటు దక్షిణ భారత భాషల్లో  సినిమాలు, ఒరిజినల్ వెబ్ సిరీస్‌‌లు  మినీ-ఒరిజినల్స్​ను నిర్మించనుంది.