oscars 2023 : ఆస్కార్‌ అవార్డు విజేతలు వీళ్లే

oscars 2023 :   ఆస్కార్‌ అవార్డు విజేతలు వీళ్లే

అమెరికాలోని లాస్‌ ఏంజిలస్‌లో జరిగిన  ఆస్కార్‌  అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకలకు సీని లెజెండ్స్ హాజరయ్యారు. 23 విభాగాల్లో ఈ సారి అవార్డులను ప్రకటించగా  ‘ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌’ అనే చిత్రం  ఏకంగా ఏడు అవార్డులను సొంతం చేసుకుంది. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి అవార్డులు ఆ చిత్రానికే దక్కాయి. ఇక మన దేశం నుంచి నామినేట్‌ అయిన త్రిబుల్ ఆర్  చిత్రం ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరిలో ‘నాటు నాటు’పాటకు ఆస్కార్‌ దక్కించుకుంది. మరోవైపు  ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిల్మ్‌ విభాగం నుంచి ‘ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’ అవార్డును సొంతం చేసుకుంది. ఈ ఏడాది ఆస్కార్‌ బరిలో నిలిచిన భారతీయ డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్‌ ‘ఆల్‌ దట్‌ బ్రీత్స్‌’ అవార్డును దక్కించుకోలేకపోయింది. శౌనకర్‌సేన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆస్కార్‌ అవార్డు తుది జాబితాలో ఎంపికైంది. అయితే  నవానీకి ఈ అవార్డు దక్కింది.

కేటగిరీల వారీగా అవార్డు పొందిన చిత్రాల పూర్తి వివరాలు

  • ఉత్తమ చిత్రం: ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్
  • ఉత్తమ దర్శకుడు: డానియెల్‌ క్వాన్‌, డానియెల్‌ షైనెర్ట్‌ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
  • ఉత్తమ నటుడు: బ్రెండన్‌ ఫ్రాసెర్‌ (ది వేల్‌)
  • ఉత్తమ నటి: మిషెల్‌ యో (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
  • ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌: నాటు నాటు (ఆర్‌ఆర్‌ఆర్‌)
  • ఉత్తమ సహాయ నటుడు: కి హుయ్‌ క్వాన్‌ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
  • ఉత్తమ సహాయ నటి: జామీ లీ కర్టిస్‌ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
  • బెస్ట్‌ కాస్ట్యూమ్‌ డెజైన్‌: రూథ్‌ కార్టర్‌ (బ్లాక్‌ పాంథర్‌: వకండా ఫరెవర్‌)
  • ఉత్తమ స్క్రీన్‌ప్లే: డానియెల్‌ క్వాన్‌, డానియెల్‌ స్కీనెర్ట్‌ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
  • ఉత్తమ సినిమాటోగ్రఫీ: జేమ్స్‌ఫ్రెండ్‌ (ఆల్‌ క్వైట్‌ ఆన్‌ది వెస్ట్రన్‌ ఫ్రంట్‌)
  • ఉత్తమ ఎడిటర్‌: పాల్‌ రోజర్స్‌ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
  • ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ : ఆల్‌ క్వైట్‌ ఆన్‌ ది వెస్ట్రన్‌ ఫ్రంట్‌ (జర్మనీ)
  • డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్‌ : అలెక్సీ నవానీ
  • బెస్ట్‌ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిల్మ్‌: ఎలిఫెంట్‌ విస్పరర్స్‌
  • బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ : క్రిస్టియన్ ఎం గోల్డ్ బెక్ ( ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్)
  • బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ : అవతార్ 2 (అవతార్: ది వే ఆఫ్ వాటర్)
  • బెస్ట్‌ సౌండ్‌ : టాప్‌గన్: మావెరిక్‌
  • బెస్ట్‌ మేకప్‌ అండ్‌ హెయిర్‌ స్టైల్‌: ది వేల్‌
  • బెస్ట్‌ యానిమేటెడ్‌ ఫీచర్‌ ఫిల్మ్‌: పినాషియో
  • లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిల్మ్‌: ఏన్‌ ఐరిష్‌ గుడ్‌బై
  • యానిమేటెడ్‌ షార్ట్‌ ఫిల్మ్‌: ద బాయ్‌, ద మోల్‌, ద ఫాక్స్‌, అండ్‌ ది హార్స్‌
  • ఉత్తమ అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే: షెరా పాల్లే (ఉమెన్‌ టాకింగ్‌)
  • ఒరిజినల్‌ స్కోర్‌: బ్రెటెల్‌మాన్‌ (ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్)