అంబర్పేట, వెలుగు: గోల్నాక కమలానగర్లో నిర్వహిస్తున్న ఓ ఉస్మానియా బిస్కెట్ తయారీ కేంద్రంపై పోలీసులు శుక్రవారం అకస్మాత్తుగా దాడి చేశారు. ఈ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో, ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే ప్రమాదకరమైన రసాయనాలు, నాసిరకం పదార్థాలు, కుళ్లిపోయిన గుడ్లను ఉపయోగించి ఇక్కడ బిస్కెట్లు తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ కేంద్రం యజమాని మేరాజ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై అంబర్పేట పోలీసులు కేసు నమోదు చేసి లోతైన దర్యాప్తు జరుపుతున్నారు.
