ఓయూ, వెలుగు: సీపీఎస్ అమలు చేయాలని ఉస్మానియా వర్సిటీ ప్రొఫెసర్లు డిమాండ్‌చేశారు. సోమవారం ఆర్ట్స్ కళాశాల నుంచి అడ్మినిస్ట్రేషన్భవన్ వరకు ర్యాలీ చేపట్టారు. రిజిస్ట్రార్ నరేశ్‌రెడ్డి, ఓఎస్డీ జితేందర్‌కుమార్ నాయక్ ను కలిసి వినతిపత్రం అందించారు. 20 ఏండ్లుగా సీపీఎస్ లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నామని తెలిపారు.
వీసీ ప్రొఫెసర్కుమార్ చొరవ తీసుకొని అమలు చేయించాలని కోరారు. ఓయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ చంద్రశేఖర్, నిజాం కళాశాల ప్రిన్సిపాల్శ్రీనివాసులు, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ కాశీం, యూజీసీ డీన్ లావణ్య, ప్రొఫెసర్లు మల్లేశం, వెంకటలక్ష్మి, నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

