ఔట్​సోర్స్ స్టాఫ్కు జీతాలు చెల్లించాలి: ఉస్మానియా కార్మికులు

ఔట్​సోర్స్ స్టాఫ్కు జీతాలు చెల్లించాలి: ఉస్మానియా కార్మికులు
  • ఉస్మానియా సూపరింటెండెంట్​కు కార్మికుల వినతి

హైదరాబాద్, వెలుగు: ఉస్మానియా హాస్పిటల్ లో ఔట్​సోర్సింగ్ టెక్నికల్, నాన్ టెక్నికల్, పారామెడికల్ సిబ్బందికి జీతాలను వెంటనే చెల్లించాలని తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్​ఔట్​సోర్సింగ్​ కాంట్రాక్ట్ ​ట్రేడ్ యూనియన్​ నాయకులు డిమాండ్ ​చేశారు. శుక్రవారం హాస్పిటల్ ఇన్ చార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాకేశ్ కుమార్ సహాయ్ ని కలిసి వినతిపత్రం అందజేశారు. 

సుపత్రిలో మూడు ఏజెన్సీల ద్వారా 217 మంది పనిచేస్తున్నారని, వారికి జులై, ఆగస్టు నెలల జీతం రాలేదని వాపోయారు. దసరా, దీపావళి పండుగల దృష్ట్యా వెంటనే జీతాలు చెల్లించాలని కోరారు. లేకుంటే అక్టోబర్​3న ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. 

నతిపత్రం ఇచ్చిన వారిలో యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రదేశ్ కుమార్, సంయుక్త కార్యదర్శి కిరణ్, రాష్ట్ర నాయకులు మహేందర్, సర్తాజ్, రవి, సాయి, సందీప్, శ్రీనివాస్ రెడ్డి, మధుకర్ తదితరులు ఉన్నారు.