రాష్ట్రంలో ఇతర పార్టీలు పోటీలు పడి ఖాళీ అవుతున్నాయి

రాష్ట్రంలో ఇతర పార్టీలు పోటీలు పడి ఖాళీ అవుతున్నాయి

రాష్ట్రంలో TRS కు దీటైన పార్టీ తమదేనని ప్రజలు గుర్తించారని తెలిపారు బీజేపీ సీనియర్ నేత మురళీధర్ రావు. ఇతర పార్టీలు పోటీలు పడి ఖాళీ అవుతున్నాయన్నారు.

గాంధీభవన్ పరిస్థితి కూడా అంతేనని పేర్కొన్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ మ్యూజియంలోనే కనిపించే అవకాశం ఉందని ఎద్దేవా చేశారు. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్, మురళీధర్ రావు సమక్షంలో కంటోన్మెంట్, మలక్ పేట నియోజకవర్గాలకు చెందిన అనేక పార్టీల నేతలు, కార్యకర్తలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మురళీధర్ రావు… తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనని, వచ్చే ఎన్నికల్లో విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు.