Weekend OTT: ఓటీటీలోకి 30కి పైగా సినిమాలు.. స్పెషల్ & ఇంట్రెస్టింగ్ జోనర్లో.. ఎక్కడ చూడాలంటే?

Weekend OTT: ఓటీటీలోకి 30కి పైగా సినిమాలు.. స్పెషల్ & ఇంట్రెస్టింగ్ జోనర్లో.. ఎక్కడ చూడాలంటే?

ప్రతి శుక్రవారం సినిమాల జాతర మొదలైనట్టే. ఈ వారం అది ముందుగానే గురువారం (జులై24) వీరమల్లు మూవీతో వచ్చింది. ప్రస్తుతం ఈ శుక్రవారం థియేటర్లో కేవలం వీరమల్లు ఒక్కటే అందుబాటులో ఉంది.

ఈ క్రమంలోనే ఆడియన్స్ని ఎక్కడ బోర్ కొట్టించకుండా ఓటీటీలోకి కొత్త సినిమాలు వస్తున్నాయి. ఏకంగా 30కి పైగా సినిమాలు, సిరీస్లు స్ట్రీమింగ్‌ కానున్నాయి. ఇందులో అన్నీరకాల జోనర్ మూవీస్.. ఆడియన్స్ను ఎంటర్ టైన్ చేయనున్నాయి. ముఖ్యంగా తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 7 సినిమాలకి పైగా అందుబాటులో ఉన్నాయి. మరి ఆ సినిమాలేంటీ? అవెక్కడ స్ట్రీమ్ అవుతున్నాయనేది ఓ లుక్కేద్దాం .

నెట్‌ఫ్లిక్స్:

ద హంటింగ్ వైవ్స్ (ఇంగ్లీష్ సైకలాజికల్ మిస్టరీ వెబ్ సిరీస్)- జూలై 21

లెటర్స్ ఫ్రమ్ ద పాస్ట్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- జూలై 23

క్రిటికల్: బిట్విన్ లైఫ్ అండ్ డెత్ (ఇంగ్లీష్ మెడికల్ డాక్యుమెంటరీ సిరీస్)- జూలై 23

మై మెలోడీ & కురోమి (జపనీస్ యానిమేషన్ సిరీస్)- జూలై 24

హిట్ మేకర్స్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ సిరీస్)- జూలై 24

ఏ నార్మల్ ఉమెన్ (ఇండోనేసియన్ సైకలాజికల్ డ్రామా)- జూలై 24

ది సాండ్‌మ్యాన్ సీజన్ 2, వాల్యూమ్ 2 (తెలుగు డబ్బింగ్ ఫాంటసీ హారర్)- జూలై 24

అంటిల్ డాన్ (ఇంగ్లీష్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్)- జూలై 25

మండల మర్డర్స్ (హిందీ క్రైమ్ వెబ్ సిరీస్)- జూలై 25

ట్రిగ్గర్ (కొరియన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూలై 25

ది విన్నింగ్ ట్రై (కొరియన్ స్పోర్ట్స్ డ్రామా సిరీస్)- జూలై 25

హ్యాపీ గిల్మోరే 2 (అమెరికన్ స్పోర్ట్స్)- జూలై 25

అమెజాన్ ప్రైమ్:

కుబేర (తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ) - జూలై 18

జస్టిస్ ఆన్ ట్రయల్ (అమెరికన్ లీగల్ థ్రిల్లర్ సిరీస్)- జూలై 21

టిన్ సోల్జర్ (ఇంగ్లీష్ థ్రిల్లర్)- జూలై 23

హ్యాండ్సమ్ గాయ్స్ (కొరియన్ హారర్)- జూలై 24

షో టైమ్ (తెలుగు క్రైమ్ థ్రిల్లర్)- జూలై 25

మార్గన్ (తెలుగు, తమిళ క్రైమ్ థ్రిల్లర్)- జూలై 25

రంగీన్ (హిందీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూలై 25

నోవాక్సిన్ (ఇంగ్లీష్ మూవీ)- జూలై 25

SUN NXT:

షో టైమ్ (తెలుగు క్రైమ్ థ్రిల్లర్)- జూలై 25

ఎక్స్ & వై (కన్నడ ఫాంటసీ డ్రామా)- జూలై 25

ఈటీవీ విన్:

ఇట్టిమాని: మేడిన్ చైనా (తెలుగు డబ్బింగ్ మలయాళ కామెడీ)- జూలై 24

జీ5:

భైరవం (తెలుగు సినిమా) - జూలై 18

సౌంకన్ సౌంకనీ 2 (పంజాబీ డ్రామా)- జూలై 25

జియో హాట్‍‌స్టార్:

స్పెషల్ OPS సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ హిందీ స్పై థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూలై 18

మై బేబీ (తెలుగు డబ్బింగ్ తమిళ క్రైమ్ థ్రిల్లర్)- జూలై 18

ఆపిల్ ప్లస్:

అకపుల్కో సీజన్ 4 (ఇంగ్లీష్ కామెడీ సిరీస్)- జూలై 23

MX ప్లేయర్:

హంటర్ సీజన్ 2 (హిందీ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్)- జూలై 24

ఈ సినిమాల్లో నవీన్ చంద్ర రీసెంట్ క్రైమ్ థ్రిల్లర్ 'షో టైమ్', విజయ్ ఆంటోనీ 'మార్గన్' తో పాటుగా రోంత్, కుబేర, భైరవం, స్పెషల్ OPS సీజన్, మై బేబీ, ది సాండ్‌మ్యాన్ సీజన్ 2, అంటిల్ డాన్, జానీ ఇంగ్లీష్ స్ట్రైక్స్ ఎగైన్, ది సస్పెక్ట్, హంటర్ సీజన్ 2, సర్జమీన్, హ్యాండ్సమ్ గాయ్స్, మండల మర్డర్స్, ఇట్టిమాని: మేడిన్ చైనా చాలా స్పెషల్‌గా ఉన్నాయి.