
ప్రతి వారం థియేటర్, ఓటీటీల్లో కొత్త సినిమాలు వస్తుంటాయి. అందులో కొన్ని సినిమాలు థియేటర్ ఆడియన్స్ ను మెప్పిస్తే, మరికొన్ని ఓటీటీ ఆడియన్స్ను మెప్పిస్తాయి. ముఖ్యంగా ఓటీటీల్లో వెబ్ సిరీస్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే, అవి ప్రేక్షకులను బాగా ఎదురుచూసేలా చేసి, గుర్తుండిపోయేలా చేయడంలో ముందుంటాయి.
ఇక థియేటర్ సినిమాలైతే ప్రేక్షకుల చేత విజిల్ పడేలా చేసుకుంటాయి. అయితే, ఈ వారం(మే12-18) థియేటర్స్లో చెప్పుకోదగ్గ సినిమాలు లేవు. కానీ, ఓటీటీల్లో మాత్రం 20కి పైగా సినిమాలు, సిరీస్లు వస్తున్నాయి. మరి ఆ సినిమాలేంటీ? అవెక్కడ స్ట్రీమ్ అవుతున్నాయి? అనే విషయాలు తెలుసుకుందాం.
నెట్‌ఫ్లిక్స్
టేస్టీఫుల్లీ యువర్స్ (కొరియన్ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్)- మే 12
C4 సింటా ( మలేషియన్ తమిళ రొమాంటిక్ కామెడీ)- మే 12
బ్యాడ్ థాట్స్ ( ఇంగ్లీష్ డార్క్ కామెడీ వెబ్ సిరీస్)- మే 13
స్నేక్స్ అండ్ ల్యాడర్స్ ( స్పానిష్ వెబ్ సిరీస్)- మే 14
థ్యాంక్యూ, నెక్ట్స్ సీజన్ 2 ( టర్కీష్ రొమాంటిక్ వెబ్ సిరీస్)- మే 15
ఫ్రాంక్లిన్ (ఇంగ్లీష్ పీరియాడిక్ డ్రామా సిరీస్)- మే 15
ఫుట్‌బాల్ పేరెంట్స్ (ఇంగ్లీష్ కామెడీ వెబ్ సిరీస్)- మే 16
డియర్ హాంగ్‌రాంగ్ (కొరియన్ మిస్టరీ డ్రామా థ్రిల్లర్ వెబ్ సిరీస్)- మే 16
రొట్టెన్ లెగసీ (స్పానిష్ పొలిటికల్ ఫ్యామిలీ డ్రామా థ్రిల్లర్ సిరీస్)- మే 16
ఈటీవీ విన్
అనగనగా (తెలుగు ఫ్యామిలీ డ్రామా)- మే 15
Just 3 Days to Go!
— ETV Win (@etvwin) May 12, 2025
A journey of emotions, love & life begins soon…#Anaganaga - A Win Original Film
From may 15
only on @ETVWIN app.@isumanth @rakeshreddy1224 @pavan_pappula @arvindmule_pd @ashwinrajasheka @Sri_Avasarala @chvenkatesh78@krishient @Asunnysanjay… pic.twitter.com/SI2LCvzIpn
జియో హాట్‍స్టార్
ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది వార్ ఆఫ్ ది రోహ్రిమ్ (ఇంగ్లీష్ యాక్షన్ ఫాంటసీ యానిమేషన్)- మే 13
హాయ్ జునూన్ (ఇండియన్ మ్యూజికల్ డ్రామా వెబ్ సిరీస్)- మే 16
ఉల్ఫ్ మ్యాన్ (ఇంగ్లీష్ హారర్ ఫాంటసీ థ్రిల్లర్)- మే 17
SUN NXT
నెసిప్పయ (తమిళ యాక్షన్ థ్రిల్లర్) -మే 16
అమెజాన్ ప్రైమ్
అర్జున్ సన్నాఫ్ వైజయంతి (ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్)- మే 12
భూల్ చుక్ మాఫ్ (హిందీ రొమాంటిక్ కామెడీ)- మే 16
యాపిల్ ప్లస్ టీవీ
మర్డర్‌బాట్ (ఇంగ్లీష్ యాక్షన్ వెబ్ సిరీస్)- మే 16
మనోరమ మ్యాక్స్
ప్రతినిరపరాధి యానో (మలయాళ డ్రామా ) -మే 12
గతవారం ఓటీటీలోకి అన్నీ తెలిసిన సినిమాలే వచ్చాయి. అందులో జాక్, గుడ్ బ్యాడ్ అగ్లీ, ఓదెల 2, రాబిన్‍హుడ్ వంటి పాపులర్ మూవీస్ ఉన్నాయి. ఈ వారంలోని పైనున్న లిస్ట్ చూస్తుంటే మాత్రం, అసలు మనకి సంబంధించిన సినిమాలే లేవనే థాట్ వస్తుంది. కానీ, అలానే ఆగిపోకండి.
ఈ వారం కూడా స్పెషల్ మూవీస్ ఉన్నాయి. అందులో సుమంత్ హీరోగా నటించిన ఫ్యామిలీ డ్రామా 'అనగనగా', కల్యాణ్ రామ్ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ఈ రెండు సిసినిమాలు డైరెక్ట్ తెలుగు సినిమాలు కావడం విశేషం. ఇక తెలుగు డబ్బింగ్ మాత్రం మలయాళ డార్క్ కామెడీ మరణమాస్,నెసిప్పయ సినిమాలున్నాయి. ఇక మిగతా సినిమాల్నీ ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో అందుబాటులో ఉండనున్నాయి.