నేడు సుప్రీం ముందుకు ‘ఓటుకు నోటు’ కేసు

నేడు సుప్రీం ముందుకు ‘ఓటుకు నోటు’ కేసు

న్యూఢిల్లీ, వెలుగు : ‘ఓటుకు నోటు’ కేసు విచారణను తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్ కు బదిలీ చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్ శుక్రవారం సుప్రీంకోర్టు ముందుకు రానుంది. ఈ అంశంలో దాఖలైన రెండు కేసుల విచారణను తెలంగా ణ వెలుపలకు మధ్యప్రదేశ్​కు బదిలీ చేయాలని బీఆర్ఎస్ నేతలు కోరారు.

ఈ ఏడాది జనవరి 31న బీఆర్ఎస్ నాయకులు జగదీశ్​రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, సత్యవతి రాథోడ్, మహ్ముద్ అలీ సుప్రీంకోర్టులో ట్రాన్స్ ఫర్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను శుక్రవారం జస్టిస్ బీఆర్ గవాయీ, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించనుంది.