12మంది MLAలకు OU JAC, నిరుద్యోగ JAC పిండ ప్రదానం

12మంది MLAలకు OU JAC, నిరుద్యోగ JAC పిండ ప్రదానం

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ, నిరుద్యోగ జేఏసీ నాయకులు రాష్ట్రంలో రాజకీయాలపై ఫైర్ అయ్యారు. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ మారి టీఆర్ఎస్ లో సీఎల్పీని విలీనం చేయాలని స్పీకర్ ను కోరడంపై మండిపడ్డారు. సీఎల్పీ విలీనాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఇది ప్రజాస్వామ్య విలువలను దిగజార్చే చర్య అని విమర్శించారు. కాంగ్రెస్ లో గెలిచి టీఆర్ఎస్ లో కలవడం అనైతికం అంటూ.. 12 మంది ఎమ్మెల్యేలకు పిండ ప్రదానం చేశారు ఓయూ జేఏసీ, నిరుద్యోగ జేఏసీ నేతలు.

హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లోని ల్యాండ్ స్కేప్ గార్డెన్ లో ఈ మధ్యాహ్నం 3.30 గంటలకు పిండ ప్రదానం చేసి నిరసన తెలిపారు. “తూ.. మీ బతుకు చెడ. మీరు బ్రతికున్నా చచ్చినట్లే” అని విమర్శించారు విద్యార్థి నాయకులు.