సీపీఎస్ అమలు చేయాలని మంత్రి హరీశ్కు ఓయూ లెక్చరర్స్ విజ్ఞప్తి

సీపీఎస్ అమలు చేయాలని మంత్రి హరీశ్కు ఓయూ లెక్చరర్స్ విజ్ఞప్తి

ఓయూ టీచర్స్ అసోసియేషన్ సభ్యులు మంత్రి హరీశ్ రావును కలిశారు. సీసీఎస్ లేదా పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. వారి విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన మంత్రి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వచ్చే బడ్జెట్ లో సీసీఎస్ పెన్షన్ విధానానికి కేటాయింపులు జరిపేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీంతో అధ్యపకుల బృందం ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఏడాదిగా తాము చేస్తున్న ప్రయత్నాలకు ఇప్పటికి ఫలితం దక్కిందని అసోసియేషన్ సభ్యులు సంతోషం వ్యక్తంచేశారు.