
పాలమూరు యూనివర్సిటీలో బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన మిలియన్ మార్చ్ ని విజయవంతం చేయాలని టీఎస్ జేఏసీ, ఓయూ జేఏసీ విద్యార్థి నాయకుడు గద్దెల అంజిబాబు పిలుపునిచ్చారు. ఓయూ ఆర్స్ట్ కళాశాల వద్ద సోమవారం(ఏప్రిల్ 24న) ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఎస్ పీఎస్ సీ పేపర్ లీకేజీ ఘటనపై సీఎం కేసీఆర్ స్పందించకపోవడంపై అంజిబాబు మండిపడ్డారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్న ముఖ్యమంత్రికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. మిలియన్ మార్చ్ లో నిరుద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పేపర్ లీకేజీ ఘటనతో నష్టపోయిన వారికి రూ.3లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.