ఓయూ స్టూడెంట్స్ ను అడ్డుకున్నరు

ఓయూ స్టూడెంట్స్ ను అడ్డుకున్నరు

హైదరాబాద్, వెలుగు: సమ్మె డిమాండ్లను పరిష్కరించకుండా మంత్రులు అవాకులు చవాకులు పేలడం వల్లనే ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఓయూ జేఏసీ నాయకులు ఆరోపించారు. ఆత్మహత్య చేసుకున్న శ్రీనివాస్ రెడ్డి, సురేందర్ గౌడ్ కు సోమవారం ఓయూలో నివాళులర్పించారు. తర్వాత మంత్రుల కార్యాలయాలను ముట్టడించేందుకు బయలుదేరిన స్టూడెంట్లను లైబ్రరీ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. వారిని అరెస్టు చేసి ఓయూ పోలీసు స్టేషన్ కు తరలించారు.

విద్యాసంస్థల సెలవుల పొడిగింపును రద్దుచేయాలని విద్యార్థి నేతలు డిమాండ్ చేశారు. ‘‘ఉద్యమంలో స్టూడెంట్లు సరిగ్గా చదువుకోలేక నష్టపోయారు. ఇప్పుడు కూడా స్టూడెంట్ల చదువులను ఆగం చేయడం సరి కాదు” అని వాపోయారు.