
- భవిష్యత్ లో మెరుగైన సంస్థగా తయారు చేద్దాం
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: సింగరేణిలో వంద మిలియన్‌టన్నుల బొగ్గు ఉత్పత్తే లక్ష్యంగా ప్లాన్ రూపొందిస్తామని సీఎండీ ఎన్. బలరాం పేర్కొన్నారు. సంస్థ భవిష్యత్ డైరెక్టర్లు, సెలెక్టెడ్ జీఎంలు, మాజీ డైరెక్టర్లు, సీపీపీలు, జీఎంలతో కొత్తగూడెంలోని గెస్ట్ హౌస్‌లో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ద్వారా మాట్లాడారు. సంస్థ భవిష్యత్ కు మెరుగైన సూచనలు, సలహాలు ఇవ్వాలన్నారు.
మార్కెట్‌తో పోటీ పడాలంటే అధిక బొగ్గు ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇతర రంగాల్లో విస్తరించే అంశాలపైనా చర్చించారు. కోల్ప్రొడక్షన్, సౌర, థర్మల్ విద్యుత్‌ఉత్పత్తి పై డైరెక్టర్ఆపరేషన్స్ఎల్వీ సూర్యానారాయణ వివరించారు.
ప్రోగ్రాం డైరెక్టర్(పా) గౌతమ్పొట్రు, డైరెక్టర్లు కె. వెంకటేశ్వర్లు, ఎం. తిరుమలరావు, అడ్వైజర్ మినిస్ట్రీ ఆఫ్కోల్ బి. వీరారెడ్డి, రిటైర్డ్ డైరెక్టర్లు డీఎల్ఆర్ప్రసాద్, బి. రమేశ్ కుమార్, ఎ. మనోహర్‌రావు, ఎ. భాస్కర్ రావు, వి. బాల కోటిరెడ్డి, రిటైర్డ్ జీఎంలు, అన్నిశాఖల జీఎంలు పాల్గొన్నారు.