న్యూఢిల్లీ: జీ20 అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన మనదేశం.. జీ20 ఫైనాన్స్ ట్రాక్ మొదటి మీటింగ్ ను మంగళవారం నుంచి నిర్వహించనుంది. జీ20 ఫైనాన్స్ అండ్ సెంట్రల్ బ్యాంక్ డిప్యూటీల సమావేశం ఈ నెల 13 నుంచి 15 వరకు బెంగళూరులో జరగనుంది. దీనికి జీ20 సభ్య దేశాలతో పాటు ఇతర దేశాలు, అంతర్జాతీయ సంస్థలను మనదేశం ఆహ్వానించింది. ఇందులో గ్లోబల్ ఎకానమీ, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్, సస్టెయినబుల్ ఫైనాన్స్, గ్లోబల్ హెల్త్, ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్ తదితర అంశాలపై చర్చించనున్నారు.
ఫైనాన్స్ మినిస్టర్లు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల మొదటి మీటింగ్ ఫిబ్రవరి 23 నుంచి 25 వరకు బెంగళూరులోనే జరగనుంది. జీ20 ఫైనాన్స్ ట్రాక్ లో భాగంగా మన దేశంలోని వివిధ ప్రాంతాల్లో దాదాపు 40 మీటింగ్స్ నిర్వహించనున్నారు. కాగా, వచ్చే ఏడాది సెప్టెంబర్లో న్యూఢిల్లీలో జీ20 సమిట్ జరగనుంది.
