ప్రస్తుత పరిస్థితుల్లో టీకాలు పని చేస్తాయని చెప్పలేం

ప్రస్తుత పరిస్థితుల్లో టీకాలు పని చేస్తాయని చెప్పలేం

న్యూఢిల్లీ: ప్రస్తుత పరిస్థితులు విషమంగా మారితే స్వదేశీ వ్యాక్సిన్ లు అంత ప్రభావవంతంగా పని చేయకపోవచ్చునని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ అన్నారు. ‘అత్యవసర పరిస్థితుల్లో మన టీకాలు సమర్థవంతంగా పని చేస్తాయని చెప్పలేం. అయితే ప్రతిసారి కొత్త వ్యాక్సిన్ లను తయారు చేయాల్సిన పని లేదు. కొత్త వేరియంట్ లను టార్గెట్ చేసుకుంటూ టీకాలు రూపొందించాల్సిన అవసరం లేదు. కానీ డ్రగ్ డెవలప్ మెంట్ విషయంలో సరైన విధానంతో ముందుకెళ్లాలి’ అని పాల్ చెప్పారు. 

ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ఇవ్వడం మీదే ఫోకస్ పెట్టామని సీఐఐ పార్ట్ నర్ షిప్ సమ్మిట్ లో పాల్ పేర్కొన్నారు. ఇలాంటి మహమ్మారులను తట్టుకునేందుకు సైన్స్ రంగంలో మరింత పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్ లో ఇలాంటి సవాళ్లను ఎదుర్కోవడానికి మనం సంసిద్ధంగా ఉండాలన్నారు. దేశ సైన్స్ రంగంలో చేస్తున్న ఇన్వెస్ట్ మెంట్ అంతా ప్రజాధనంతోనే అని స్పష్టం చేశారు.