పరిగి మార్కెట్లో కాలం చెల్లిన వెహికల్స్

పరిగి మార్కెట్లో కాలం చెల్లిన వెహికల్స్

పట్టించుకోని ఆర్టీఏ అధికారులు

పరిగి, వెలుగు: పరిగి మార్కెట్​లోని వ్యాపారస్తులు నిబంధనలు పాటించడంలేదు. సరుకు తరలించే వెహికల్స్​ను ఓవర్​లోడ్​తో నడిపిస్తున్నారు. లారీ నిర్వాహకులు పరిమితికి మించి ధాన్యం సంచులను నింపుకెళ్తున్నారు. దీంతో పరిగి మార్కెట్లో ట్రాన్స్​పోర్ట్​నే ఉపాధిగా నమ్ముకొని జీవనం సాగిస్తున్న చాలామందికి పనిలేకుండా పోతోంది. కొంతమంది వ్యాపారులు కాలం చెల్లిన లారీలను అధిక లోడ్ తో తీసుకెళ్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడంలేదు. 10 టైర్ల లారీ 20 టన్నులకు మించి తరలించరాదు. కానీ ఈ మార్కెట్​లో 30 టన్నులు కూడా తరలిస్తున్నారు.

12 టైర్ల లారీ 25 టన్నులు మాత్రమే తరలించాల్సి ఉండగా దాదాపు 40 టన్నులు.. 14 టైర్ల వెహికల్​30 టన్నులు మాత్రమే తీసుకెళ్లాల్సి ఉండగా దాదాపు 50 టన్నులు తరలిస్తున్నాయి. అధిక లోడుతో లారీలు తిరుగుతుండటంతో మార్కెట్ రోడ్లు దెబ్బతింటున్నాయి. తాడు ఊడిపోయి సంచులు రోడ్డుపై పడిపోగా ప్రమాదాలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఆర్టీఏ అధికారులు ఎలాంటి తనిఖీలు చేయడంలేదు. ఇప్పటికైనా స్పందించి ఓవర్ లోడ్ తో నడుస్తున్న వెహికల్స్​పై చర్యలు తీసుకోవాలని పరిగి మార్కెట్లో పనిచేస్తున్నవారితోపాటు, అక్కడికి వచ్చేవారు కోరుతున్నారు. కాలం చెల్లిన వెహికల్స్​రోడ్డెక్కకుండా చూడాలని డిమాండ్​ చేస్తున్నారు.