కిరాణ సామాగ్రి కోసం వెళ్లిన చిన్నారిని చిదిమేసిన దుండగులు.. భగ్గుమన్న తమిళనాడు.. సీఎం విజయ్ సీరియస్

కిరాణ సామాగ్రి కోసం వెళ్లిన చిన్నారిని చిదిమేసిన దుండగులు.. భగ్గుమన్న తమిళనాడు.. సీఎం విజయ్ సీరియస్

తమిళనాడు భగ్గుమంటోంది. కిరాణా సామాగ్రికని వెళ్లిన పదేళ్ల చిన్నారిని ఓ కిరాతకుడు చిదిమేసిన ఘటనపై కోయంబత్తూరు వీధులన్నీ నిరసన జ్వాలలతో రగులుతున్నాయి. గురువారం ( 2026 మే 21) సాయంత్రం కనిపించకుండా పోయిన చిన్నారి.. శవంగా తేలడంతో రాష్ర్టంలో ఒక్కసారిగా ఆగ్రహజ్యాలలు అంటుకున్నాయి. 

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. గురువారం మిస్సింగ్ అయిన చిన్నారి.. ఆ మరుసటి రోజు కోయంబత్తూరు సూలూర్ ఏరియాలోని కన్నంపాలాయమ్ చెరువు దగ్గర తీవ్రగాయాలతో చనిపోయిన స్థితిలో కనిపించింది. ఈ కేసులో పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 

సూలూర్ ఏరియాలో సరుకులు తీసుకునేందుకు వెళ్లిన బాలికను దుండగులు కిడ్నాప్ చేసి హత్యచేసినట్లు పోలీసులు చెప్పారు. నిందితులను కార్తీక్, మోహన్ రాజ్ గా పేర్కొన్నారు. ఈ దారుణ ఘటనతో షాక్ కు గురైన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా కుప్పకూలిపోయి పుట్టెడు దుఖంలో పడిపోయారు. తమకు న్యాయం చేయాల్సిందిగా కుటుంబ సభ్యులు, బంధువులు సూలూర్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. 

  • సీఎం విజయ్ ఆగ్రహం:

ఈ దారుణ ఘటనపై సీఎం విజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలను సహించేది లేదన్నారు. 10 ఏళ్ల బాలిక హత్యకేసు షాక్ కు గురిచేసిందని అన్నారు. ఇలాంటి అమానవీయ, క్షమించరాని క్రిమినల్ చర్యలను ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదన్నారు. హంతకులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

►ALSO READ | వరంగల్ జిల్లాలో ప్రియురాలి తల్లిదండ్రులను చంపిన ప్రేమోన్మాదికి ఉరిశిక్ష

తమకు న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని మార్చురీ నుంచి తీసుకునేది లేదని బాలిక కుటుంబ సభ్యులు పట్టుబట్టారు. సీఎం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే వ రకు ఒప్పుకునేది లేదని అన్నారు. సీఎం స్పందించడం లేదని.. ప్రభుత్వం మారినా పరిస్థితులు మారలేదని విమర్శలకు దిగారు. ఈ క్రమంలో సీఎం విజయ్ ప్రకటన చేశారు. కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు

  • డీఎంకే ఫైర్:

ఈ ఘటనపై ప్రతిపక్ష డీఎంకే పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. టీవీకే ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లో లేదని విమర్శించారు.