స్థంభించిన స్పెయిన్.. టెలికాం సేవల్లో భారీ అంతరాయం, ఏమైదంటే?

స్థంభించిన స్పెయిన్.. టెలికాం సేవల్లో భారీ అంతరాయం, ఏమైదంటే?

Spain Telecom Outage: ప్రస్తుత సాంకేతిక యుగంలో అత్యంత ముఖ్యమైనది సమాచారం వ్యవస్థ. దీనికి టెలికాం, ఇంటర్నెట్ సేవలు చాలా ముఖ్యమైనవిగా మారిపోయాయి. ఈ రెండు లేకుండా కనీసం నిమిషాలు సైతం జీవించలేని పరిస్థితుల్లో ప్రపంచం ఉందనేది వాస్తవం.

ఈ క్రమంలోనే స్పెయిన్ దేశంలో అతిపెద్ద సమాచార అంతరాయం ఏర్పడిందని వెల్లడైంది. దీంతో అక్కడ ల్యాండ్ లైన్ సేవలు, ఇంటర్నెట్ సేవలు ప్రభావితం అయ్యాయి. వేలాది మంది ప్రజలు దీనిపై ఆందోళన వ్యక్తం చేయగా.. స్పెయిన్ అత్యవసర సేవలు సైతం అనేక ప్రాంతాల్లో నిలిచిపోయాయి నివేదించబడింది. నెట్‌వర్క్ సమస్యలతో మే 20 ఉదయం నుంచి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. స్పెయిన్ ప్రధాన టెలికాం ఆపరేటర్ టెలిఫోనికా చేపడుతున్న నెట్‌వర్క్ అప్ గ్రేషన్ దీనికి కారణంగా తేలింది. దీంతో మూవీస్టార్, ఓటూ సేవలకు భారీగా అంతరాయం ఏర్పడింది. 

దీంతో స్పెయిన్ వ్యాప్తంగా అత్యవసర సేవలకు వినియోగించే 112 నంబర్ సేవలకు కూడా అంతరాయం ఏర్పడింది. దీంతో అక్కడి అధికారులు ప్రజలకు ప్రత్యామ్నాయ నంబర్లను కూడా ఎమర్జెన్సీ అవసరాల కోసం అందుబాటులోకి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. టెలిఫోనికా నెట్‌వర్క్ అప్‌గ్రేడ్ అంతరాయానికి అనుమానిత కారణమైనప్పటికీ, దేశవ్యాప్తంగా ఎదుర్కొంటున్న ఇతర ఇంటర్నెట్ సమస్యలు కూడా కంపెనీ కొనసాగిస్తున్న పనికి నేరుగా సంబంధం కలిగి ఉన్నాయా అనేదానిపై స్పష్టత లేదని స్పెయిన్ స్థానిక మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే అధికారులు దీనిని వేగంగా పరిష్కరించి సేవలను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.