ఎక్స్‌పీరియన్స్ చూసైనా మమ్మల్ని పర్మినెంట్ చేయాలి

ఎక్స్‌పీరియన్స్ చూసైనా మమ్మల్ని పర్మినెంట్ చేయాలి
  • కేసీఆర్ ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి

అవుట్ సోర్సింగ్ నర్సులను పర్మినెంట్ చేస్తామని ఇచ్చిన హామీని కేసీఆర్ నిలబెట్టుకోవాలని అవుట్ సోర్సింగ్ నర్సులు కోరారు. గాంధీ, నిలోఫర్ ఆస్పత్రులలో విధులు నిర్వహిస్తున్న అవుట్ సోర్సింగ్ స్టాప్ నర్సులు హైదరాబాద్ ఎన్ఎస్ఎస్‌లో సమావేశం ఏర్పాటు చేశారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు 20 శాతం వెయిటేజీ మార్కులు కలిపి తమకు ఉద్యోగాలు కల్పించాలని  2017 నోటిఫికేషన్ అభ్యర్థులు కోరారు. మళ్లీ ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చినా.. ఇప్పటికే 40 సంవత్సరాలు పైబడిన తమకు రాసే అర్హత లేదని వారు అన్నారు. ఇప్పటికే 16 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్‌తో పని చేస్తున్న తమను క్రమబద్ధీకరించాలని కోరారు. కరోనా సమయంలో గాంధీ హాస్పిటల్‌ను సందర్శించిన కేసీఆర్.. తమ సేవలను మెచ్చుకొని పర్మినెంట్ చేస్తామని ఇచ్చిన హామీని గుర్తు చేశారు. తమ కంటే ఐదు సంవత్సరాల జూనియర్లు.. నర్సింగ్ సూపరిండెంట్లు అయ్యారని.. జూనియర్ల కింద పని చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అవుట్ సోర్సింగ్ స్టాఫ్ నర్సులను పర్మినెంట్ చేయాలని లేకపోతే ఎంతటి ఆందోళనకైనా సిద్ధమని తెలిపారు.