
ఎన్ని చలాన్లు వేసినా మారడంలేదు..ఎన్ని అవగాహన కార్యక్రమాలు పెట్టినా ఫలితంలేదు..హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించడం పరిపాటి అయిపోయింది. ట్రాఫిక్ పోలీసులు ఫొటోకొట్టుకుంటారు..చలాన్లు పంపిస్తారు.డిస్కౌంట్లు ఇస్తుంటారు..వాళ్లపని వాళ్లు చేసుకుంటారు..మేం మాత్రం మారం అన్నట్లుంది సిటీలో వాహనదారుల తీరు. కేవలం హైదరాబాద్ నగరంలో ఒక్క వారంలో రికార్డు స్థాయిలో ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నమోదు అయ్యాయి. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన స్పెషల్ డ్రైవ్ లో రికార్డు స్థాయిలో ట్రాఫిక్ రూల్స్ అతిక్రమణ కేసులు నమోదు అయ్యాయి. మే 20 నుంచి మే 26 వరకు వారం రోజుల పాటు నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మొత్తం 18,798 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నమోదు చేశారు.
మే 27, మంగళవారం విడుదల చేసిన అధికారిక నోటిఫికేషన్ ప్రకారం..రాంగ్ రూట్ లో వాహనం నడిపినందుకు వాహనదారులపై దాదాపు 14,917 కేసులు చేశారు. ఈ ప్రమాదకరమైన పద్ధతి ప్రజా భద్రతకు తీవ్రమైన ప్రమాదాలను కలిగిస్తోందని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు.
►ALSO READ | హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన
ఇక నంబర్ ప్లేట్ సరిగ్గా లేని వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝుళిపించారు. ఈ విషయంలో మొత్తం 3,881 కేసులు నమోదు చేశారు. ఇది వాహన గుర్తింపు నిబంధనలకు విరుద్దమని తెలిపారు.
రోడ్డు నియమాలను పాటించి, సురక్షితమైన హైదరాబాద్‌కు దోహదపడాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు తమ పిలుపునిచ్చారు. “ట్రాఫిక్ నియమాలను పాటించండి. హైదరాబాద్‌ను సురక్షితంగా ఉంచుకుందాం” అని ఆ విభాగం తన సందేశంలో #FollowTrafficRules అనే హ్యాష్‌ట్యాగ్‌ని ఉపయోగించి అవగాహన కల్పిస్తున్నారు.