కొత్త ఎడ్యుకేషన్‌ పాలసీతో 2కోట్ల మంది పిల్లలు తిరిగి పాఠశాలలకు

కొత్త ఎడ్యుకేషన్‌ పాలసీతో 2కోట్ల మంది పిల్లలు తిరిగి పాఠశాలలకు
  • హయ్యర్‌‌ ఎడ్యుకేషన్‌ సెక్రటరీ అమిత్ ఖారే

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన న్యూ ఎడ్యుకేషన్‌ పాలసీ లక్షలాది మందికి విద్య అందిస్తుందని, అందరికీ హయ్యర్‌‌ ఎడ్యుకేషన్‌ అందుతుందని హయ్యర్‌‌ ఎడ్యుకేషన్‌ సెక్రటరీ అమిత్‌ ఖారే అన్నారు. ఈ కొత్త పాలసీ వల్ల దాదాపు రెండు కోట్ల మంది తిరిగి పాఠశాలలకు చేరుకుంటారని అన్నారు. హయ్యర్‌‌ ఎడ్యుకేషన్‌ యాక్సిక్‌ పెరుగుతుందని, గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో 26 శాతం నుంచి 50 శాతానికి పెరుగుతుందని అన్నారు. ఈ పాలసీ కింద యూజీసీ, ఏఐసీటీఈని కలిపి హయ్యర్‌‌ ఎడ్యుకేషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియాను తీసుకొస్తామని అన్నారు. దీనికి సంబంధించి పార్లమెంట్‌లో బిల్లు తీసుకురానున్నట్లు చెప్పారు. ఇండియన్‌ యూనివర్సిటీల్లో క్వాలిటీని పెంచి ఫారెన్‌ స్టూడెంట్స్‌ను ఆకర్షిస్తాడని అన్నారు. ఇప్పుడు ఉన్న పాలసీ ప్రకారం డీమ్డ్‌ యూనివర్సిటీలు అబ్రాడ్‌లో క్యాంపస్‌లను ఏర్పాటు చేసుకునే వీలు ఉంటుందని అన్నారు. మల్టీ డిసిప్లీనరీ ఎడ్యుకేషన్‌కి కూడా దీని వల్ల ఇంప్రూవ్‌ అవుతుందని అభిప్రాయపడ్డారు.