
రాజస్థాన్ లో ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. 2023 మే26 న జరిగిన సామూహిక వివాహాలు గిన్నిస్ బుక్ లో రికార్డు సృష్టించాయి. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రకారం 12 గంటల్లో 2,000 మందికి పైగా జంటలు పెళ్లి చేసుకున్నారు. 2013లో 24 గంటల్లలో యెమెన్ దేశంలో 963 జంటలు అత్యధిక వివాహాలు చేసుకున్న రికార్డును తాజాగా బద్దలు కొట్టారు.
శ్రీ మహావీర్ గోశాల కళ్యాణ్ సంస్థాన్ సమాజంలో అట్టడుగు వర్గాలకు ఇలా సామూహిక వివాహాలు చేస్తోంది. ఇందులో హిందూ, ముస్లిం జంటలకు వివాహాలు జరిగాయి. ప్రతీ ఒక్కరు కూడా ఆరు గంటలతోపు వివాహం చేసుకున్నారు. ముందుగానే వధూవరులు పూలదండలు మార్చుకుని పెళ్లి మండపానికి చేరుకున్నారు. ప్రతీ జంట వివాహాన్ని వారి మతానికి అనుగుణంగా పూజారుల చేత నిర్వహించారు.
పెళ్లి అయిపోయాక ప్రతి ఒక్క జంటకు వివాహ ధృవీకరణ పత్రాలను అధికారులు అందించారు. పెళ్లి చేసుకున్న జంటలకు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ శుభాకాంక్షలు తెలిపారు. పెళ్లి చేసుకున్న ప్రతి వధువుకు ఆభరణాలు, పరుపులు, వంటగది పాత్రలు, టెలివిజన్, రిఫ్రిజిరేటర్, కూలర్, ఇండక్షన్ కుక్కర్ వంటి గృహోపకరణాలు వంటి బహుమతులు అందజేశారు. పెళ్లికి హాజరైన అతిధులకు భోజనాల సౌకర్యం ఏర్పాటు చేశారు.