క్రూయిజ్ షిప్‌లో ప్రయాణిస్తున్న 300మందికి మిస్టీరియస్ డిసీజ్

క్రూయిజ్ షిప్‌లో ప్రయాణిస్తున్న 300మందికి మిస్టీరియస్ డిసీజ్

అమెరికాకు చెందిన ఓ క్రూయిజ్ షిప్ లో దాదాపు 300 మంది అంతుచిక్కని వ్యాధి బారిన పడ్డారని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీఎస్) వెల్లడించింది. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 5వరకు టెక్సాస్ నుంచి మెక్సికోకు ప్రయాణించిన వారిలో ఈ లక్షణాలు కనిపించినట్టు తెలిపింది. ఈ షిప్ లో మొత్తం 2881మంది ప్రయాణిస్తుండగా వారిలో 284మంది అస్వస్థతకు గురయ్యారు. 1159మంది సిబ్బందిలో 34మంది అంతుచిక్కని అనారోగ్యం పాలయ్యారు. ఓడలో మొత్తంగా 13శాతం ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. వీరికి వాంతులు, విరేచనాలు ఉన్నట్టు సమాచారం. అయితే ఈ అనారోగ్యానికి కారణం మాత్రం ఇంకా తెలియలేదు. 

అనంతరం టెక్సాస్ లోని గాల్వెస్టన్ నౌకాశ్రయానికి చేరుకు్నన ఎపిడెమియాలజిస్టులు, పర్యావరణ ఆరోగ్య అధికారులు వచ్చి పరిస్థితిని సమీక్షించారు. ఈ ఓడలో వ్యాధి ప్రారంభం నుంచి శానిటైజేషన్, డిస్ ఇన్ఫెక్ట్ మందులను వాడి నౌకను సిబ్బంది శుభ్రంగా ఉంచుతున్నారు. సీడీఎస్ పరీక్షల కోసం నమూనాలను కూడా సేకరించారు. ఇంతకుమునుపు రూబీ ప్రిన్సెస్ క్రూయిజ్ షిప్ లోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. 2020లో ఈ క్రూయిజ్ షిప్ లో వందలాది మంది కరోనా బారిన పడ్డారు. దాంతో ఆస్ట్రేలియాలో ఓ ఓడరేవులో ఆ షిప్ ను నిలిపివేశారు.