హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి(పీఆర్, ఆర్డీ) శాఖలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 3,500 మందికిపైగా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు గడిచిన ఐదు నెలలుగా జీతాలు రావడం లేదని కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగ సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి. వెంటనే వేతనాలు ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వాన్ని కోరాయి.లేకుంటే సంక్రాంతి తర్వాత ఉద్యమం చేపడతామని హెచ్చరించాయి.
కాగా..పంచాయతీరాజ్ కమిషనరేట్ ఆఫీసులో సిబ్బంది కొరత నెలకొందని టీఎన్జీవో పీఆర్, ఆర్డీ యూనిట్ ఆఫీస్ బేరర్లు తెలిపారు. పనిభారం పెరిగినా, స్టాఫ్ లేకపోవడంతో ప్రభుత్వ పథకాల అమలులో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వెంటనే 30 కొత్త పోస్టులు మంజూరు చేసి కమిషనరేట్‌ను బలోపేతం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
