ఐటీ సంక్షోభం : 2023లో 4.25 లక్షల మంది ఉద్యోగాలు పోయాయి.. సెలవుల్లోనూ ఊస్టింగ్స్

ఐటీ సంక్షోభం : 2023లో 4.25 లక్షల మంది ఉద్యోగాలు పోయాయి.. సెలవుల్లోనూ ఊస్టింగ్స్

ఆర్థిక భారం, నష్టాల పేరుతో ఇప్పటికే పలు దిగ్గజ సంస్థలు, కంపెనీలు, స్టార్టప్ లు తమ సిబ్బందిని వదిలించుకునే ప్రయత్నం చేశాయి. ఇది ఈ ఏడాదిలో మరింత ఎక్కువైంది. ఏడాది ఆరంభం మొదలు ఇప్పటి వరకు పలు కంపెనీలు పలు దశల్లో ఉద్యోగుల్ని తీసివేశాయి. అర్టిఫిషియల్ ఇంటలీజెన్స్ కారణంగా ఇటీవలి కాలంలో ఈ కోత అనేది రోజురోజుకూ తీవ్రమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలు ఇప్పుడు సెలవు సీజన్‌లో కూడా ఉద్యోగులను తొలగిస్తున్నాయి.  
 
ప్రపంచవ్యాప్తంగా స్టార్టప్ లతో సహా టెక్ కంపెనీలు గడిచిన రెండెళ్లలో (డిసెంబర్ 26, 2023) 4లక్షల 25వేల కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించాయి. అదే సమయంలో దేశంలో 36వేల కంటే ఎక్కువ మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. టెక్ సెక్టార్ ఉద్యోగాల కోతలను ట్రాక్ చేసే వెబ్ సైట్ తాచా డేటా ప్రకారం, 1,178 టెక్ కంపెనీలు ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 2లక్షల 60వేల 771మంది ఉద్యోగులను తొలగించాయి. 2022లో 1,061 టెక్ కంపెనీలు 1లక్ష 64వేల 769మంది ఉద్యోగులను పీకేసింది.

గడిచిన రెండేళ్లలో ప్రతి రోజూ దాదాపు 582మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. అంటే గంటకు 24మంది ఎక్కువ అన్నమాట. ఇటీవలే పేటీఎం దాదాపు వెయ్యి మంది ఉద్యోగులను తొలగించి, ఖర్చులను తగ్గించుకునే పనిలో పడింది. ఇదే తరహాలో సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ షేర్ చాట్ వ్యూహాత్మక పునర్నిర్మాణంలో భాగంగా 200మంది ఉద్యోగులను అంటే దాదాపు 15శాతం ఉద్యోగులను ఇంటికి పంపింది.