
- నలుగురికి ఇస్తామన్న మంత్రి తుమ్మల
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం మొట్ట మొదటిసారిగా అగ్రికల్చర్, హార్టీకల్చర్ వర్సిటీ విద్యార్థులకు యూఎస్‌లోని ఏయుబీయుఆర్‌ఎన్ యూనివర్సిటీ లో సంబంధిత విద్య లో మాస్టర్స్ డిగ్రీ చేసేందుకు మూడేండ్ల పాటు ఓవర్సీస్ ఫెలోషిప్ ఇవ్వనుంది. రెండు వర్సిటీల నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఇద్దరూ చొప్పున మొత్తంగా ఏడాదికి నలుగురికి ఫెలోషిప్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.
వ్యవసాయ శాఖ మంత్రి తమ్మల అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. మాస్టర్స్ కు అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. యూనివర్సిటీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థుల నుంచి ఎంపిక జరుగుతుందని చెప్పారు. ఈ ఫెలోషిప్ తో విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయని మంత్రి పేర్కొన్నారు.