ఓవర్ స్పీడ్ తో కారు బోల్తా..స్పాట్ లోనే ఒకరు..

ఓవర్ స్పీడ్ తో కారు బోల్తా..స్పాట్ లోనే ఒకరు..

వికారాబాద్, వెలుగు: కారు బోల్తా పడి ఓ వ్యక్తి చనిపోగా.. నలుగురు గాయపడ్డ ఘటన వికారాబాద్ పీఎస్ పరిధిలో జరిగింది. కామారెడ్డి జిల్లా గాంధారికి చెందిన సందీప్ కుమార్, ప్రసాద్, సాయిరామ్, హన్మంతు(32), విక్రమ్ కుమార్ నలుగురు జాతీయ ఉపాధి హామీ స్కీమ్​లో ఫీల్డ్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్నారు. గురువారం రాత్రి  ఈ  నలుగురు  కారులో  గాంధారి  నుంచి   బయలుదేరి 
వికారాబాద్​లోని అనంతగిరికి వచ్చారు. 

శుక్రవారం ఉదయం అనంత పద్మనాభ స్వామి ఆలయంలో దర్శనం చేసుకున్నారు. తిరిగి అక్కడి నుంచి యాదగిరి గుట్టకు బయలుదేరారు. విక్రమ్ కుమార్ ఓవర్ స్పీడ్​గా కారు నడపడంతో వికారాబాద్ పట్టణంలోని కొత్తగడి వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో హన్మంతు తలకు బలమైన గాయాలై అక్కడిక్కడే మృతి చెందాడు. మిగతా నలుగురికి గాయాలు కాగా వారిని దగ్గరలోని హాస్పిటల్​కు తరలించారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.