20 బస్తీ దవాఖానాల్లో ఆక్సిజన్ ఫెసిలిటీ.. స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఏర్పాటు చేస్తున్న బల్దియా

20 బస్తీ దవాఖానాల్లో ఆక్సిజన్ ఫెసిలిటీ.. స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఏర్పాటు చేస్తున్న బల్దియా
  •     మరిన్ని సంస్థలు ముందుకొస్తే మిగిలిన వాటిలో ఏర్పాటు!  

హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ పరిధిలోని 20 బస్తీ దవాఖానాల్లో పేషెంట్ల కోసం ఆక్సిజన్ ఫెసిలిటీ అందుబాటులోకి రానుంది. బల్దియా అధికారులు ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో సెల్ఫ్ జనరేట్ ఆక్సిజన్ మెషినరీని ఏర్పాటు చేస్తున్నారు. సిలిండర్ల రీఫిల్లింగ్ అవసరం లేకుండా ప్లాన్ చేస్తున్నారు. కూకట్​పల్లి, ఎల్​బీనగర్, సికింద్రాబాద్, ఖైరతాబాద్, శేరిలింగంపల్లి, చార్మినార్ జోన్లలో మూడు చొప్పున ఏర్పాటు చేయాలని, రెండింటిని అవసరమైన స్లమ్​  ఏరియా ల్లోని బస్తీ దవాఖానాల్లో పెట్టించాలని నిర్ణయించారు.

10 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి కానుంది. మిగిలిన బస్తీ దవాఖానాల్లోనూ ఆక్సిజన్​ ఫెసిలిటీ కల్పించేందుకు మరికొన్ని సంస్థలు ముందుకు రావాలని బల్దియా అధికారులు కోరుతున్నారు.

త్వరలో మరో 36 బస్తీ దవాఖానాలు

గ్రేటర్ పరిధిలో ప్రస్తుతం 264 బ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్తీ ద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాఖానాలు కొనసాగుతున్నాయి. కొత్తగా మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రో 36 ప్రారంభించేందుకు బల్దియా ఏర్పాట్లు చేస్తోంది. గతంలో డివిజన్​కు 2 చొప్పున మొత్తం 300 ఏర్పాటు చేయాలని నిర్ణయించగా ఇప్పటి వరకు 264చోట్ల అందుబాటులోకి వచ్చాయి. ప్రతిఒక్కచోట ఓపీ, ప్రాథమిక రోగ నిర్ధారణ పరీక్షలు, గర్భిణులు, బాలింతలకు పరీక్షలు, వ్యాక్సిన్లు వేయడం, రక్తహీనత, కుటుంబ నియంత్రణ పరీక్షలు, బీపీ, షుగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, క్యాన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరీక్షలు చేస్తున్నట్లు చెబుతున్నప్పటికీ కొన్నిచోట్ల ఈ సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

శాంపిల్స్ ​తీసుకుని రిపోర్టులు ఇవ్వడం లేదని చాలా మంది ప్రైవేటు ల్యాబ్​లకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులు గుర్తించి చర్యలు తీసుకుంటే బస్తీల్లో మెరుగైన వైద్యం అందే అవకాశం ఉంది. అలాగే బస్తీ దవాఖానాల్లో మరికొన్ని సేవలు అందించాలనే డిమాండ్లు వ్యక్తం అవుతున్నాయి.