ఇండియన్ హాస్పిటాలిటీ సంస్థ ఓయోజపాన్ లో అపార్ట్‌మెంట్ రెంటల్ సర్వీసులను లాంచ్ చేసింది. వెయ్యికి పైగా రెసి డెన్షియల్ యూనిట్లతో టోక్యో లో ‘ఓయో లైఫ్’ సర్వీసులను ప్రారంభించినట్టు ఈ సంస్థ ప్రకటించింది. అద్దెఇళ్లను కోరుకునే వారి అభిరుచులకు అనుగుణంగా జపాన్ లో పూర్తిగా ఫర్నీష్ అయిన అపార్ట్‌మెం ట్లనే ఓయో ఆఫర్ చేయడం ప్రారంభించింది. యాహూ జపాన్ కార్పొరే షన్ తో కలిసి ఓయో ఒక జాయింట్ వెంచర్ ను ఏర్పాటు చేసి, జపాన్ లో హౌజింగ్ రెంటల్ మార్కె ట్ లోకి ప్రవేశించినట్టు ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ప్రకటించింది. జాయింట్ వెంచర్ ద్వారా ఓయో హౌజింగ్ రెంటల్ వ్యాపారాలను ప్రారంభించిన తొలి మార్కెట్ ఇదే. ఇక్కడ ఇంకా హోటల్ ఆపరేషన్స్‌ను ఓయో ప్రారంభించాల్సి ఉంది. ఓయో లైఫ్ ద్వారా జపాన్ లో ఎలాంటి సమస్యలు లేకుండా, టెక్ ఆధారితంగా, సరసమైన ధరలో నివాసయోగ్యాన్ని అప్ గ్రేడ్ చేయనున్నామని ఓయో హోటల్స్ అండ్ హోమ్స్ వ్యవస్థాపకుడు, గ్రూప్ సీఈవో రితేష్ అగర్వాల్ చెప్పారు. టోక్యో వ్యాప్తంగా వెయ్యికి పైగా యూనిట్లలో ఈ సర్వీసులు లాంచ్ చేశామని, ముందస్తుగానే 11వేల ప్రీ రిజిస్ట్రేషన్లు తమకు వచ్చాయని పేర్కొన్నారు. విద్యార్థులు, యంగ్ ప్రొఫిషినల్స్ నుంచి ఎక్కు వగా డిమాండ్ వస్తున్నట్టు అగర్వాల్ తెలిపారు. ఇండియా, చైనా లాంటి చాలా మార్కె ట్లలో బడ్జెట్ నుంచి మిడ్ సెగ్మెంట్ హాస్పిటాలిటీ స్పేస్ వరకు ఓయోనే ఎక్కువ మంది ఎంపి క చేసుకుంటోన్న బ్రాండ్ గా ఉంది. జపాన్ మార్కెట్ లో కూడా విజయం సాధిస్తామని కంపెనీ విశ్వాసం వ్యక్తం చేస్తోంది. ఓయో లైఫ్ సర్వీసుల కింద జపాన్ లో అద్దె ఇళ్లను కోరుకునే వారికి పూర్తిగా ఫర్నీష్ అయిన అపార్ట్‌మెం ట్లను, ఇండిపెండెంట్ హౌజ్ లను, సెక్యురిటీ డిపాజిట్, ప్రవేశ రుసుము లేకుండానే షేరింగ్ హౌజ్ లను ఆఫర్ చేయబోతుంది. సబ్ స్క్రిప్షన్ ఆధారిత మెంబర్ షిప్ ప్రొగ్రామ్ ఓయో పాస్ పోర్ట్‌ను కూడా లాంచ్ చేసింది. దీని ద్వారా జపాన్‌లో వందల కొద్దీ కార్పొరేట్ పార్టనర్ల నుంచి డిస్కౌంట్లను, డీల్స్‌ను కస్టమర్లకు ఆఫర్ చేస్తుంది. అంతేకాక ఓయో లైఫ్ ను యాహూలో ఇంటిగ్రేట్ చేసింది. 2013లో ప్రారంభమైన ఓయో ప్రస్తుతం 10 దేశాల్లో 500కి పైగా నగరాల్లో తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 18వేలకు పైగా ఫ్రాంచైజ్ లేదా లీజ్ హోటల్స్, 6వేలకు పైగా హౌజ్ లను తన ప్లాట్ ఫామ్‌పై అందిస్తోంది.
