
న్యూఢిల్లీ: బ్రిటిష్ షిప్పింగ్ కంపెనీ పీ అండ్ ఓ ఫెర్రీస్ జూమ్ మీటింగ్‌లోనే 800 మంది ఉద్యోగులను తొలగించింది. కిందటేడాది బెటర్ డాట్ కామ్ సీఈఓ విశాల్ గర్గ్ జూమ్ మీటింగ్‌లోనే 900 తీసేసిన విషయం తెలిసిందే. మానవత్వం లేకుండా ఇలా ఉద్యోగులను జాబ్స్ నుంచి తీసేసినందుకు చాలా మంది సీనియర్ ఇండస్ట్రీలిస్టులు అప్పుడు గర్గ్‌ను విమర్శించారు కూడా. ఇలాంటి విధానాన్నే బ్రిటిష్ కంపెనీ పీ అండ్ ఓ ఫెర్రీస్ ఫాలో అయ్యింది. మూడు నిమిషాల పాటు జరిగిన జూమ్ మీటింగ్‌లో ఒకే సారి 800 మంది ఉద్యోగులను తొలగించింది. వీరు నోటీస్ పీరియడ్‌లో పనిచేయడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. ప్రస్తుతం ఈ కంపెనీ తీసుకున్న నిర్ణయంపై విమర్శలొస్తున్నాయి. ప్రస్తుతం కంపెనీ ఆర్థిక కష్టాల్లో ఉందని ఫెర్రీస్ తన ఉద్యోగులకు తెలిపింది. ‘ఈ విషయం చెప్పడానికి చింతిస్తున్నా. మిమ్మల్ని జాబ్ నుంచి తొలగిస్తున్నాం’ అని పీ అండ్ ఓ చీఫ్ జూమ్ కాల్‌లో పేర్కొన్నారు.