
ముషీరాబాద్, వెలుగు: బీసీ రిజర్వేషన్లను ఎవరైనా అడ్డుకోవాలని చూస్తే తరిమికొడతామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. సోమవారం విద్యానగర్ బీసీ భవన్ లో జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ నేతృతంలో కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకించి గ్రామాల్లో శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టవద్దన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పెంపు న్యాయబద్ధమైందన్నారు. ఈ కార్యక్రమంలో కోలా జనార్ధన్, జిలపల్లి అంజి, అల్లంపల్లి రామకోటి, పగిళ్ల సతీశ్, వరప్రసాద్ యాదవ్, అభి గౌడ్, రాకేశ్, ఆశిష్, బాలయ్య పాల్గొన్నారు.