మరో మాస్‌ టైటిల్‌తో వస్తున్న యంగ్ హీరో

మరో మాస్‌ టైటిల్‌తో వస్తున్న యంగ్ హీరో

హైదరాబాద్: టాలీవుడ్‌ యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌ భిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. వెళ్లిపోమాకే మూవీతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ యంగ్ హీరో.. ఈ నగరానికి ఏమైంది, ఫలక్‌ నుమా దాస్‌ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రీసెంట్ గా పాగల్‌తో ప్రేక్షకులను పలకరించాడు. ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమాతో మరోమారు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు.

ఈ విషయాన్ని అటుంచితే.. తాజాగా మరో సినిమాను అనౌన్స్‌ చేశాడు ఈ మాస్‌ హీరో. ‘దాస్ కా ధమ్కీ’అనే మాస్ టైటిల్ ను ఈ కొత్త సినిమాకు ఫిక్స్ చేశారు. ఈ మూవీకి నరేశ్‌ కుప్పిలి దర్శకత్వం వహిస్తుండగా.. ప్రసన్న కుమార్‌ బెజవాడ కథ, మాటలు అందిస్తున్నారు. వణ్మయి క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నివేతా పేతురాజ్‌ హీరోయిన్ గా నటిస్తోంది. 

 

మరిన్ని వార్తల కోసం:

అన్నదాతలు ఏకమైతే.. ఢిల్లీ పాలకులు పారిపోతారు

నోటిఫికేషన్స్ ఇచ్చుడు సరే.. భర్తీ చేస్తరా.. లేదా?