అన్నదాతలు ఏకమైతే.. ఢిల్లీ పాలకులు పారిపోతారు

అన్నదాతలు ఏకమైతే.. ఢిల్లీ పాలకులు పారిపోతారు

న్యూఢిల్లీ: మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఆరోపణలు చేస్తూ వస్తున్న ఆయన.. మోడీ సర్కారును గద్దె దించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో దేశంలోని రైతులంతా ఏకమై మార్పు తీసుకురావాలని.. బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. హరియాణాలోని జింద్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సత్యపాల్.. తన పదవీకాలం ముగిసిన తర్వాత నార్త్ ఇండియా మొత్తం పర్యటిస్తానన్నారు. అక్కడి అన్నదాతల్ని ఒక్కతాటి పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తానని స్పష్టం చేశారు. 

‘మరో రెండేళ్లలో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. అందరూ కలసికట్టుగా ఓట్లేస్తే.. ఢిల్లీలో అధికారంలో ఉన్న వారు పారిపోతారు. రైతులు ఏకమైతే ఎవర్నీ బతిమిలాడాల్సిన అవసరం ఉండదు’ అని సత్యపాల్ పేర్కొన్నారు. రైతులు రోడ్లపై కూర్చుని ఉద్యమాలు చేయడం ఆపి.. అందరూ ఒక్కటై పవర్ లోకి రావాలని ఆయన చెప్పారు. అధికారంలో ఉన్న వారు రైతుల్ని బిచ్చగాళ్లలా చూస్తున్నారని మండిపడ్డారు. అన్నదాతలు ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు సరైన మద్దతు ధర దక్కడం లేదన్నారు. అదే రైతులు అధికారంలోకి వస్తే.. మద్దతు ధర కోసం ఎవర్నీ అడుక్కోవాల్సిన అవసరం ఉండదన్నారు. 

మరిన్ని వార్తల కోసం:

నోటిఫికేషన్స్ ఇచ్చుడు సరే.. భర్తీ చేస్తరా.. లేదా?

ఒకప్పుడు మన భాషను జోకర్లా పెట్టేటోళ్లు

కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కు ప్రభుత్వం గుడ్న్యూస్