అయ్యప్ప ప్రచారకర్తగా రవీందర్గౌడ్

అయ్యప్ప ప్రచారకర్తగా రవీందర్గౌడ్

నవీపేట్, వెలుగు: మండల కేంద్రంలోని నందిగామ గ్రామానికి చెందిన పడాల రవీందర్ గౌడ్ అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ రాష్ట్ర ఈసీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. జిల్లా కోటగిరి అయ్యప్ప స్వామి ఆలయంలో ఆదివారం అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జాతీయ అధ్యక్షుడు అయ్యప్పదాస్ అధ్యక్షత వహించగా, రాష్ట్ర అధ్యక్షుడు టీవీ పుల్లంరాజు రాష్ట్ర కమిటీ సభ్యులను ప్రకటించారు. 

ఈ సందర్భంగా పుల్లంరాజు మాట్లాడుతూ తక్కువ కాలంలోనే 21 కమిటీలు ఏర్పాటు చేసి, ఏబీ ఏపీ సంఘ అభివృద్ధికి కృషి చేస్తున్నవారిని అభినందించారు. ఇదే క్రమంలో జాతీయ కమిటీ సమక్షంలో ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి చేయాల్సిన బాధ్యతను పడాల రవీందర్ గౌడ్‌కు అప్పగిస్తూ రాష్ట్ర ఈసీ మెంబర్‌గా ఎంపిక చేసినట్లు తెలిపారు. 

రవీందర్ గౌడ్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఆదిలాబాద్ జిల్లాను దత్తతగా ఇచ్చిన జాతీయ కమిటీకి ధన్యవాదాలు తెలిపారు.  సంఘ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తానన్నారు. నిర్మల్ జిల్లా అధ్యక్షుడు సునీల్ గురుస్వామి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు జంగం రమేశ్, రాష్ట్ర ఈసీ మెంబర్ పుట్టి కృష్ణ, మండల బ్రాంచ్ అధ్యక్షుడు రచ్చ ఆదినాథ్, ఈసీ మెంబర్ చల్లా నగేశ్, నిఖిలేశ్ పాల్గొన్నారు.