వెంకటాపూర్/ గోవిందరావుపేట, వెలుగు: ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం బుస్సాపూర్ పీఏసీఎస్, చల్వాయిలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం ములుగు కలెక్టర్ దివాకర ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎఫ్ఏక్యూ నామ్స్ ప్రకారం ధాన్యాన్ని తీసుకురావాలన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఎవరైనా అక్రమాలకు పాల్పడితే చర్యలు తీసుకుని, కేంద్రాన్ని క్యాన్సల్ చేస్తామని హెచ్చరించారు.
ఎలాంటి సమస్య ఉన్నా కలెక్టర్ ఆఫీస్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ 9347416178 కు ఫిర్యాదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ మహేందర్ జీ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ కల్యాణి, జిల్లా పౌరసరఫరాల అధికారి సయ్యద్ షా పైసల్ హుస్సేన్, డీఆర్డీవో శ్రీనివాసరావు రాంపతి, డీసీవో సర్దార్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
