
- రెండో విడతలో 68 మందికి పురస్కారాలు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ జగదీ శ్ సింగ్ ఖేహార్ పద్మ విభూషణ్, సినీనటి, ప్రముఖ డ్యాన్సర్ శోభన చంద్రకుమార్ పద్మభూషణ్, ఎమ్మాఆర్పీఎస్ వ్యవస్థాప అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పద్మశ్రీ అవార్డులను అందు కున్నారు. మంగళవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ గణతంత్ర మండపంలో రెండో విడత పద్మ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పురస్కారాలు అంద జేశారు.
ఈ ఏడాది మొత్తం 139 మందికి కేంద్రం పద్మ అవార్డులు ప్రకటించగా.. తొలి విడత ఏప్రిల్ 28న 71 మంది, మంగళవారం రెండో విడతలో 68 మంది అవార్డులు అందుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి మందకృష్ణ, వి.రాఘవేంద్రాచార్య పంచముఖి, ప్రొఫెసర్ కేఎల్ కృష్ణ పద్మశ్రీ అవార్డులు అందుకున్నారు.