ఎరుకల కులస్తుల సంక్షేమానికి ప్రాధాన్యం: పద్మా దేవేందర్​రెడ్డి

ఎరుకల కులస్తుల సంక్షేమానికి ప్రాధాన్యం: పద్మా దేవేందర్​రెడ్డి

మెదక్ టౌన్, వెలుగు : ఎరుకుల కులస్తుల సంక్షేమానికి బీఆర్​ఎస్​ అధిక ప్రాధాన్యతనిస్తోందని పార్టీ మెదక్ అభ్యర్థి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలో జరిగిన ఎరుకల  ఆత్మీయ సమ్మేళన సభకి హాజరై మాట్లాడారు. గత ప్రభుత్వాలు కులవృత్తులను విస్మరించాయని, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత  సీఎం కేసీఆర్​ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. ఎరుకల కులస్తులకు  గుర్తించిన ప్రభుత్వం  పందుల పెంపకానికి నిధులు కేటాయించిందన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే  సంక్షేమ ఫలాలు అందరికి అందుతాయని, మరోసారి ఆడబిడ్డగా ఆశీర్వదించి తనను గెలిపించాలని కోరారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు సత్యనారాయణ, శశిధర్ రెడ్డి, మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు  గంగాధర్, కౌన్సిలర్ ఆంజనేయులు, ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షుడు భిక్షపతి, జిల్లా, మండలాల ఎరుకల సంఘం అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు.