సమాజం కోసమే జీవించిన వ్యక్తి పద్మశ్రీ టీవీ నారాయణ

సమాజం కోసమే జీవించిన వ్యక్తి  పద్మశ్రీ టీవీ  నారాయణ

సంస్మరణ సభకు హాజరైన హర్యానా గవర్నర్ బండారు దత్తత్రేయ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తదితరులు

హైదరాబాద్: సమాజ హితం కోసం జీవించిన గొప్ప వ్యక్తి పద్మశ్రీ టీవి నారాయణ అని హర్యానా గవర్నర్ బండారు దత్తత్రేయ కొనియాడారు. అందరూ అభిమానించే గొప్ప వ్యక్తి టీవీ నారాయణ అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో పద్మశ్రీ టీవీ నారాయణ సంస్మరణ సభ జరిగింది. ఈ సభకు హర్యానా గవర్నర్ బండారు దత్తత్రేయ, మంత్రి కిషన్ రెడ్డితో పాటు తెలంగాణ హెచ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య, నేషనల్ ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు రాములు, ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్, మాజి డీజీపీ కృష్ణ ప్రసాద్, ఐ.ఏ.ఎస్ అధికారి విద్యా సాగర్ తదితరులు పాల్గొని... టీవీ నారాయణ చిత్రపటానికి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారు పద్మశ్రీ టీవీ నారాయణతో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. సభలో గవర్నర్ బండారు దత్తత్రేయ మాట్లాడుతూ... పద్మశ్రీ టీవీ నారాయణ విద్యావేత్తగా, రచయితగా, సామజిక వేత్తగా మానవతావాదిగా, చెరగని ముద్ర వేశారన్నారు. జీవితాంతం నీరాడంబరంగా బతికారని, తన జీవితం ఎంతో మందికి స్ఫూర్తినిస్తుందన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ... తాను ఎమ్మెల్యే గా ఉన్నపుడు చాలా సార్లు ఆయనతో వేదికలు పంచుకున్నానన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబెర్ గా ఉండి కూడా ఆర్టీసీ బస్ లో ప్రయాణం చేస్తూ నిరాడంబర జీవితాన్ని గడిపారన్నారు.హెచ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య, నేషనల్ ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు రాములు, ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ మాట్లాడుతూ... ఆర్య సమాజం లో ఎన్నో సంస్కరణలు చేశారని, భగవద్గీత మీద పరిశోధన చేసి డాక్టరేట్ పొందారన్నారు. టీవీ నారాయణ భార్య, మాజీ మంత్రి  టీ.ఎన్ సదాలక్ష్మి సేవలను కూడా వక్తలు కొనియాడారు. 

మరిన్ని వార్తల కోసం:

కేసీఆర్.. నిరుద్యోగులు నిన్ను తరమకుండా చూస్కో

భారీ ధరకు అమ్ముడుపోయిన భారత స్టార్ బ్యాట్స్మన్