
పహల్గాం దాడులకు పాల్పడిన ది గ్రూప్ రెసిస్టెంట్ ఫ్రంట్ (TRF) ను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ ప్రకటించింది.జమ్మూకాశ్మీర్ లో370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత పుట్టుకొచ్చిన లష్కరే తోయిబా ఫ్రాక్సీ గ్రూప్ ఇది. పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థ ISI దీని మద్దతుతో టెర్రరిస్ట్ గ్రూప్ ఇది.
TRF హింసాత్మక చర్యలు, 2021లో జమ్మూ కాశ్మీర్‌లో పౌరులపై జరిగిన దాడులు చేయడం ద్వారా TRF తనను తాను స్థానిక టెర్రరిస్టు గ్రూప్ గా చూపించుకుంటున్నప్పటికీ ఇది లష్కర్-ఎ-తొయిబాకు చెందిన ఓ ప్రాక్సీ సంస్థ అని US స్పష్టం చేసింది. ఈ సంస్థ పాకిస్తాన్ నుంచి నిధులు , మద్దతు పొందుతూ కాశ్మీర్ లోయలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతోందని స్పష్టం చేసింది.
TRF ఆన్ లైన్ ద్వారా యువతను రిక్రూట్ చేసుకోవడం, ఉగ్రవాదులను చొప్పించడం, పాకిస్తాన్ నుంచి జమ్మూ కాశ్మీర్కు ఆయుధాలు, డ్రగ్స్ అక్రమంగా రవాణా చేయడం వంటి విద్రోహ చర్యలకు పాల్పడుతోంది. ఈ సంస్థ జమ్మూ కాశ్మీర్‌లో పౌరులు, రాజకీయ నేతలు, భద్రతా బలగాలపై అనేక దాడులకు పాల్పడింది. TRF వ్యవస్థాపకుడు ,కమాండర్ షేక్ సజ్జాద్ గుల్ నుభారత్ లోని అన్‌లాఫుల్ యాక్టివిటీస్ (ప్రివెన్షన్) యాక్ట్, 1967 కింద ఇప్పటికే ఉగ్రవాదిగా ప్రకటించారు.
TRF, దాని సంబంధిత పేర్లను లష్కర్ ఏ తొయిబా ఇప్పటికే FTO, SDGT లిస్టులో చేర్చారు. ఈ చర్యల ద్వారా TRF దాని అనుబంధ సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వీలు కలుగుతుంది.
TRF అదర్ యాక్టివిటీస్ ..
TRF పహల్గామ్ దాడితో పాటు, భారత భద్రతా బలగాలపై అనేక ఇతర దాడులకు పాల్పడింది. ఇది కాశ్మీరీ హిందువులు, ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులు, వ్యాపారులు ,స్థానిక రాజకీయ నేతలు, టూరిస్టులతో సహా పౌరులపై దాడులు , హత్యలకు కూడా బాధ్యత వహించింది. ఇది తనను తాను ఓ లౌకిక సంస్థగా చూపించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ మతపరమైన మైనారిటీలపై దాడులను కొనసాగించింది.
TRF ను గ్లోబల్ టెర్రిరిస్టు గ్రూప్ గా అమెరికా ప్రకటించడం భారత్ కు ఓ దౌత్యపరమైన విజయం. ఇది ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్,అమెరికా మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఈ గుర్తింపు TRF కార్యకలాపాలను అంతర్జాతీయ స్థాయిలో అడ్డుకునేందుకు, దాని నిధులు రాకుండా అడ్డుకునేందుకు సాయపడుతుంది.