పాక్ గగనతలం 48 గంటలు మూసివేత

పాక్ గగనతలం 48 గంటలు మూసివేత

కరాచీ: ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో సైనిక దాడులు చేయడంతో భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి. ఇందుకు ప్రతిస్పందనగా అన్ని విమానాల రాకపోకలకు 48 గంటల పాటు తమ ఎయిర్ స్పేస్ ను మూసివేస్తున్నట్టు పాకిస్తాన్ ప్రకటించింది. ముందు జాగ్రత్త చర్యగా ఈ చర్యలు చేపట్టినట్టు తెలిపింది. 

పాకిస్తాన్ సివిల్ ఏవియేషన్ అధికారులు ఇస్లామాబాద్, లాహోర్ మీదుగా ఉన్న గగన తలాన్ని మూసేశారు. విమానాలను కరాచీకి మళ్లించారు. అయితే, ఎయిర్  స్పేస్ ను ఎనిమిది గంటలు మూసివేసిన తర్వాత విమానయాన అధికారులు గగనతలాన్ని తిరిగి తెరిచారు. ఆలస్యమైన దేశీయ, అంతర్జాతీయ విమానాలు రావడంతో కరాచీలోని జిన్నా ఇంటర్నేషన్ ఎయిర్ పోర్టులో భారీ రద్దీ కనిపించింది.