ఇండియా.. పాకిస్తాన్​ యుద్ద మేఘాలు: పంజాబ్​ పొలాల్లో పాక్​ డ్రోన్​ శకలాలు

ఇండియా.. పాకిస్తాన్​ యుద్ద మేఘాలు:  పంజాబ్​ పొలాల్లో పాక్​ డ్రోన్​ శకలాలు

భారత.. పాకిస్తాన్​ దేశాల మధ్య యుద్ద మేఘాలు నెలకొన్నాయి.  అధికారికంగా ప్రకటించకపోయినా .. ఇరు దేశాలు అదే ధోరణిని అవలంభిస్తున్నాయి.  పాక్​ కవ్వింపు చర్యలను భారత్​ ఎక్కడికక్కడ అడ్డుకుంటుంది.  తాజాగా పంజాబ్‌లోని అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలోని పంట పొలాల్లో పాకిస్తాన్​కు చెందిన  క్షిపణి శకలాలు కనిపించడం కలకలం రేపింది. జేతువాల్, మఖాన్ విండి, పంధేర్ గ్రామాల పరిధిలోని పొలాల్లో ఈ  అవశేషాలను గుర్తించారు. 

'ఆపరేషన్ సిందూర్ కొనసాగుతున్న సమయంలో, తమ ప్రాంతంలో భారీ శబ్దం వినిపించిందని, వెంటనే విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని స్థానికులు చెబుతున్నారు. భారీ పేలుడు శబ్దం వినిపించిన తర్వాత చుట్టుపక్కల భయానక వాతావరణం నెలకొందని జేతువాల్ గ్రామస్తులు భయాందోళనలు వ్యక్తం చేశారు.  

అక్కడికి దగ్గరలోని మఖాన్ విండి గ్రామస్థులు  తమ పొలాల్లో రాకెట్ వంటి వస్తువుల శకలాలు పడి ఉన్నాయని పోలీసులకు సమాచారం అందించారు. ఈ గ్రామాలు  అంతర్జాతీయ సరిహద్దుకు కేవలం 30 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి. మఖాన్ విండి సమీపంలోని ఒక పొలంలో దాదాపు ఆరు అడుగుల పొడవున్న లోహపు శకలం లభించింది. పంజాబ్ పోలీసులు ఈ శకలాలను గుర్తించిన విషయాన్ని ధృవీకరించారు.

 పాక్.. భారత సరిహద్దు రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్స్, మిస్సైల్స్ తో దాడులకు పాల్పడింది. వెంటనే అప్రమత్తమైన భారత ఆర్మీ.. వాటిని కుల్చివేశాయి. మూడు పాక్ ఫైటర్ జెట్ లను కూల్చివేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఓ పాక్ పైలట్ ను భారత సైనికులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, బార్డర్ లో యుద్ధ వాతావరణం నెలకొనడంతో దేశవ్యాప్తంగా భద్రతా చర్యలను కట్టుదిట్టం చేస్తున్నారు.